ఈ 8 మంది “తెలుగు” టాప్ హీరోలతో నటించిన… ఒకే ఒక్క “హీరోయిన్” ఎవరో తెలుసా.?

ఈ 8 మంది “తెలుగు” టాప్ హీరోలతో నటించిన… ఒకే ఒక్క “హీరోయిన్” ఎవరో తెలుసా.?

by kavitha

Ads

శృతిహాసన్ మొదట తమిళ చిత్రాల ద్వారా తెలుగు ఆడియెన్స్ కి పరిచయమైంది. అనగనగా ఓ ధీరుడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. అయితే ఈ మూవీ ప్లాప్ కావడంతో శృతి హాసన్ కు కలిసి రాలేదు. అదే టైమ్ లో కోలీవుడ్ లో ఆమె చేసిన చిత్రాలు కూడా ఫ్లాప్ అయ్యాయి.దాంతో శృతిహాసన్ కి ఐరన్ లెగ్ అనే పేరు వచ్చింది.

Video Advertisement

ఆ తరువాత పవన్ కళ్యాణ్ తో నటించిన ‘గబ్బర్ సింగ్’ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ మూవీ శృతిహాసన్ కెరీర్ ను మలుపు తిప్పింది. ఆ సినిమా తరువాత శృతిహాసన్ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఆమె చేసిన సినిమాలన్నీ దాదాపు హిట్ అయ్యాయి. కానీ ప్రేమ, పెళ్లి విషయాలతో కొన్ని రోజులు ఆమె సినిమాలకు దూరం అయ్యింది. రవితేజ ‘క్రాక్’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. మళ్ళీ వరుస చిత్రాలతో దూసుకుపోతుంది. టాలీవుడ్ లోని ఎనిమిది మంది స్టార్ హీరోలతో నటించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
1. పవన్ కళ్యాణ్:

పవన్ కళ్యాణ్ సినిమాలు వరుసగా ప్లాప్ అవుతున్న సమయంలో హరీష్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ‘గబ్బర్ సింగ్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ సినిమాలో పవన్ కి జోడీగా శృతి హాసన్ నటించింది. ఆమెకి కూడా బ్లాక్ బస్టర్ మూవీ ఇదే. ఈ సినిమాతో శృతి హాసన్ లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. వకీల్ సాబ్ సినిమాలో కూడా పవన్ తో మరోసారి నటించింది.
2.రామ్ చరణ్ :

డైరెక్టర్ వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘ఎవడు’ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.
3.అల్లు అర్జున్ :

డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన రేసుగుర్రం సినిమాలో అల్లు అర్జున్ పక్కన శృతి హాసన్ హీరోయిన్ గా చేసింది.ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది.4.మహేష్ బాబు :

సూపర్ స్టార్ మెహెష్ బాబుతో శృతి హాసన్ ‘శ్రీమంతుడు’ సినిమాలో నటించింది.ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఘన విజయం సాధించింది.

5.జూనియర్ ఎన్టీఆర్ :

హరీష్ శంకర్ డైరెక్షన్ లో ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన చిత్రం రామయ్యా వస్తావయ్యా. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.ఇందులో మరో హీరోయిన్ గా సమంత నటించింది.
6. మెగాస్టార్ చిరంజీవి:

బాబీ దర్శకత్వంలో వచ్చిన వాల్తేరు వీరయ్య చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి కి రిలీజ్ అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
7. నందమూరి బాలకృష్ణ:

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌ పై నిర్మించిన వీరసింహరెడ్డి సినిమాలో బాలకృష్ణ పక్కన హీరోయిన్ గా శృతి హాసన్ నటించింది. ఈ మూవీకి గోపీచంద్ మలినేని దర్శకుడు.సంక్రాంతికి విడుదల అయిన ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది.
8 ప్రబాస్:

కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా సలార్. ఈ సినిమాలో ప్రభాస్, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా నటించారు.
Also Read: ఇదేంటి రాజమౌళి గారు..? “నాటు నాటు” సాంగ్ ని కూడా కాపీ కొట్టారా..? ఎక్కడ నుంచి అంటే..?


End of Article

You may also like