ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల గురించి భారతదేశం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూసింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రేక్షకుల ఆసక్తిని అర్థం చేసుకున్న సినిమా బృందం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినిమాకి సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా షేర్ చేసుకున్నారు.

Video Advertisement

ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన విడుదల కాబోతోంది అనే సినిమా బృందం ప్రకటించింది కానీ కరోనా కారణంగా సినిమా వాయిదా పడింది. ఈ సినిమా కోసం ఎదురుచూసిన ప్రేక్షకులకు నిరాశే ఎదురయింది.

natu natu song 3

ఈ సినిమాలోని నాటు నాటు పాట ఇటీవల ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇందులో ఇద్దరు హీరోలు కలిసి డాన్స్ చేయడం అనేది థియేటర్ లో విజిల్స్ వేసేలా చేసింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది భారతదేశంలో ఉన్న అన్ని సినిమా ఇండస్ట్రీలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ పాటని ఆస్కార్ వేదిక మీద కూడా పాడారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి వేసిన స్టెప్స్ ఆకర్షణగా నిలిచాయి. వారిద్దరినీ అలా కలిసి డాన్స్ చేస్తూ తెరపై చూడటం ఇదే మొదటిసారి.

natu natu song 2

ఈ సాంగ్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ వేసిన స్టెప్ లు కేక పెట్టించాయి. పక్కా మాస్ సాంగ్ లో ఇద్దరు దుమ్ము దులిపేసారు. వారు వేసిన స్టెప్ లు కూడా చాలా ట్రేండింగ్ లో నిలిచాయి. అయితే.. ఈ పాటని కూడా కాపీ చేసారు అంటూ సోషల్ మీడియాలో కధనాలు వైరల్ అవుతున్నాయి. ఈ పాటతో పాటు కొరియోగ్రఫీని కూడా కాపీ చేశారు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.

natu natu song 1

ఓ ఆఫ్రికన్ మసాక సాంగ్ నుంచి ఈ పాటను కాపీ చేసారు అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఒరిజినల్ సాంగ్ లో కూడా ఇద్దరు అబ్బాయిలు ఆపకుండా ఇలాంటి స్టెప్స్ టోన్ డాన్స్ వేస్తూ ఉంటారు. ఆ సాంగ్ ని కూడా మీరు ఈ కింద వీడియో లో చూసేయండి.

watch video :