Home Filmy Adda పూనమ్ పాండే ఇప్పటి వరకు సంపాదించిన ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

పూనమ్ పాండే ఇప్పటి వరకు సంపాదించిన ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

by Mohana Priya

నటి పూనమ్ పాండే హఠాన్మరణం చెందారు. మొన్నటి వరకు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న పూనమ్ పాండే మరణం అందరిని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎంతో మంది సెలబ్రిటీలు పూనమ్ పాండే మరణానికి సంతాపం తెలుపుతూ పోస్ట్ చేశారు. పూనమ్ పాండే వయసు 31 సంవత్సరాలు.

అనారోగ్య సమస్యల కారణంగా పూనమ్ పాండే చనిపోయారు. 2011 వరల్డ్ కప్ సమయంలో ఇండియా కప్ గెలిస్తే తాను స్టేడియంలో తిరుగుతాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు పూనమ్ పాండే ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించారు.

poonam pandey properties value

కొన్ని ఫోటోషూట్స్ ద్వారా వివాదాల్లోకి వెళ్లారు. సమాజంలో ఉన్న ఆలోచనలకు భయపడకుండా, తాను ఏది అనుకుంటే అదే మాట్లాడేవారు. అలాగే ఉండేవారు. బిగ్ బాస్ ప్రోగ్రాం అవకాశం వచ్చినా కూడా తిరస్కరించారు. అందుకు కారణం రెమ్యూనరేషన్ అని సమాచారం. బిగ్ బాస్ హిందీ వాళ్ళు పూనమ్ పాండేకి 2 నుండి 2.5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఇస్తాము అన్నారు. కానీ తనకి మూడు కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చే అంత పాపులారిటీ ఉంది అని ఆ ఆఫర్ ని తిరస్కరించినట్టు సమాచారం. ఆ తర్వాత మరొక సీజన్ లో పాల్గొన్నారు.

poonam pandey properties value

అయితే పూనమ్ పాండే ఇప్పటి వరకు బాగానే సంపాదించారు. ఆమె ఆస్తుల విలువ దాదాపు 52 కోట్లు ఉంటుంది. పూనమ్ పాండే కొన్ని సినిమాల్లో కూడా నటించారు. పూనమ్ పాండే సామాజిక సేవ కూడా చేసేవారు. కరోనా సమయంలో ఎంతో మందికి తనకి చేతనైనంత సహాయం చేశారు. తెలుగులో కూడా మాలిని అండ్ కో అనే ఒక సినిమాలో నటించారు. పూనమ్ పాండే చివరిగా 2018 లో వచ్చిన ద జర్నీ ఆఫ్ కర్మ అనే సినిమాలో నటించారు.

poonam pandey properties value

ఆ తర్వాత 2022 లో లాక్ అప్ అనే ఒక టెలివిజన్ సిరీస్ లో నటించారు. ఇది ఒక రియాలిటీ షో. ఇందులో దాదాపు సెమీఫైనల్స్ వరకు వెళ్లారు. ఇవాళ సోషల్ మీడియా ద్వారా పూనమ్ పాండే మేనేజర్ తన మరణ వార్తని తెలియజేశారు. మొదట ఈ విషయం ఎవరికీ అర్థం అవ్వలేదు. కానీ తర్వాత అందరూ సోషల్ మీడియా ద్వారా పూనమ్ పాండే మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ALSO READ : ఇంత చిన్న ఆమెని తల్లి పాత్రలో ఎలా పెట్టారు..? జగతి మేడం రియల్ ఏజ్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

You may also like