ఇంత చిన్న ఆమెని తల్లి పాత్రలో ఎలా పెట్టారు..? జగతి మేడం రియల్ ఏజ్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

ఇంత చిన్న ఆమెని తల్లి పాత్రలో ఎలా పెట్టారు..? జగతి మేడం రియల్ ఏజ్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

by kavitha

బుల్లితెర పై ప్రసారం అయ్యే సీరియల్స్ కు ఎంత ఆదరణ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. సీరియల్ నచ్చిందంటే ప్రేక్షకులు దానిని నెత్తిన పెట్టుకుంటారు. ఇక ఆ సీరియల్ లోని పాత్రలను ప్రేమిస్తుంటారు. ఆ పాత్రలలో నటించేవారిని సొంత మనుషులుగా భావిస్తూ కనెక్ట్ అయిపోతుంటారు.

Video Advertisement

అలా ప్రేక్షకులు కనెక్ట్ అయిన సీరియల్ పాత్ర జగతి మేడం. గుప్పెడంత మనసు సీరియల్ లో కీలక పాత్ర అయిన జగతిని ఆడియెన్స్ చాలా ఇష్టపడ్డారు. హీరో తల్లిగా జగతి  పాత్రలో నటించిన నటి జ్యోతి రాయ్. నెట్టింట్లో సందడి చేసే ఆమె తాజాగా తన రియల్ ఏజ్ ను రివీల్ చేశారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
తెలుగు సీరియల్స్ లో టాప్ రేటింగ్ తెచ్చుకున్న సీరియల్  గుప్పెడంత మనసు. కార్తీక దీపం లాంటి సీరియల్ టో పోటీ పడిన ఈ సీరియల్ తక్కువ సమయంలోనే ప్రేక్షకాదరణ పొందింది. సీరియల్ లోని హీరోహీరోయిన్లకు ధీటుగా  జగతి మేడం పాత్రలో జ్యోతి రాయ్ ఆకట్టుకున్నారు. తన కట్టు బొట్టు, హుందాతనంతో ఆడియెన్స్ ని ఫిదా చేశారు. అయితే ఈ పాత్ర మరణించింది. ఆమె లేని సీరియల్ ని ఆడియెన్స్ చూడలేకపోతున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జ్యోతి రాయ్ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫహోటవలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తోంది.
సీరియల్ చాలా హుందాగా ఉండే జ్యోతి రాయ్ నెట్టింట్లో మాత్రం గ్లామర్, హాట్ ఫోటోలతో హల్చల్ చేస్తోంది. ఆ మధ్య పర్సనల్ విషయాలతో వైరల్ అయ్యింది. ప్రస్తుతం ప్రెట్టీ గర్ల్ అనే వెబ్ సిరీస్ తో పాటు, పలు కన్నడ చిత్రాలలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. సీరియల్ లో తల్లి పాత్ర చేసిన జ్యోతి బయట ట్రెండీ వేర్స్ ధరించి, యంగ్ గా కనిపిస్తుంది. ఆమె ఏజ్ ఎంత అని అభిమానులు చాలా రోజుల నుండి అడుగుతూ ఉన్నారు.
తాజాగా అభిమనులతో చిట్ చాట్ చేసిన జ్యోతి రాయ్ ని  ‘మీ ఏజ్ ఎంతో చెప్పగలరా’ అని అడుగగా,  పాన్ కార్డ్ లో పుట్టిన తేదీని చూపించింది. అందులో 1994లో జన్మించినట్టు ఉంది. అంటే జ్యోతి ఏజ్ 30 సంవత్సరాలే కావడంతో షాక్ అవుతున్నారు. తల్లి పాత్ర చేయడంతో ఆమె వయసు ఎక్కువగా ఉంటుందని భావించారు. ఈ ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది.

https://www.instagram.com/jyothiraiofficial/reel/CursM0OrQGL/

Also Read: గుంటూరు కారం “దమ్ మసాలా” పాటలో కనిపించిన ఈ అమ్మాయి ఎవరో తెలుసా..? ఈమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

 


You may also like

Leave a Comment