Ads
విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరొక సినిమా రాబోతోంది. వీరిద్దరి కాంబినేషన్ లో అంతకుముందు వచ్చిన రెండు సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో మూడవ సినిమా రాబోతోంది.
Video Advertisement
అయితే ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఒక వార్త ప్రచారంలో ఉంది. అదేంటంటే ఈ సినిమాకి ముందుగా హీరోగా చిరంజీవిని అనుకున్నారట. చిరంజీవికి అనిల్ రావిపూడి ఈ సినిమా కథ కూడా వినిపించినట్టు సమాచారం.
కానీ కొన్ని కారణాల వల్ల చిరంజీవి ఈ ప్రాజెక్ట్ చేయలేకపోయారు. దాంతో ఇప్పుడు ఈ సినిమాని వెంకటేష్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియదు. కానీ వీళ్ళిద్దరి కాంబినేషన్ మీద అంచనాలు భారీగానే నెలకొన్నాయి. అంతకుముందు వచ్చిన రెండు సినిమాలు హిట్ అవ్వడంతో ఈ సినిమా కూడా హిట్ అవుతుంది ఏమో అని అందరూ అనుకుంటున్నారు.
End of Article