పేటీఎం ఫిబ్రవరి 29 తరువాత పనిచేయదా..? ఈ లోగా కస్టమర్లు ఏం చేయాలి..?

పేటీఎం ఫిబ్రవరి 29 తరువాత పనిచేయదా..? ఈ లోగా కస్టమర్లు ఏం చేయాలి..?

by kavitha

Ads

పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంకు పై  రిజర్వ్ బ్యాంక్  ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.  ఆర్‌బీఐ ఆంక్షల నేపథ్యంలో, ఫిబ్రవరి 29 అనంతరం పేటీఎం బ్యాంక్ కు చెందిన పలు సేవలు నిలిచిపోనున్నాయి.

Video Advertisement

పేటీఎం రూల్స్ ను ఉల్లంఘించినందు వల్ల ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. ఆర్‌బీఐ బుధవారం నాడు ఈ ప్రకటన చేసిన అనంతరం భారీగా పేటీఎం షేర్లు పడిపోయాయి. గురువారం ట్రేడింగ్ మొదలు కాక ముందే పేటీఎం షేర్లు ఇరవై శాతం పతనం అయ్యాయి. అయితే ఫిబ్రవరి 29 అనంతరం పేటీఎం పనిచేయదా? అప్పటిలోగా  యూజర్లు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..
బీబీసి న్యూస్ తెలుగు కథనం ప్రకారం, దేశంలో డిజిటల్ పేమెంట్ యాప్స్ లో పేటీఎమ్ కూడా ఒకటి. డిజిటల్ పేమెంట్ మార్కెట్ లో పేటీఎమ్ వాటా 16 నుండి 17 శాతం ఉంటుంది. బుధవారం నాడు రిజర్వ్ బ్యాంక్ పేటీఎమ్ పేమెంట్స్ బ్యాంకు పై ఆంక్షలు విధిస్తూ ఓ ప్రకటన రిలీజ్ చేసింది. పేటీఎం ఆడిట్ రిపోర్ట్ తో  పాటు ఇతర బాహ్య ఆడిటర్ల రిపోర్ట్స్ ప్రకారం, తరచుగా పేటీఎం రూల్స్ ని ఉల్లంఘించినట్లుగా తేలింది. అందువల్ల బ్యాంకుల నియంత్రణ చట్టంలో ఉన్న ’35ఏ’ రూల్ ప్రకారంగా, ఫిబ్రవరి 29 అనంతరం  పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లో లావాదేవీలు, వ్యాలెట్, క్రెడిట్ డిపాజిట్, ఫాస్టాగ్ టాప్‌అప్‌లు ఆపేస్తున్నాము.
కస్టమర్ల బ్యాలెన్స్ ఉపసంహరించుకోవడానికి, ఉపఎగిన్చుకోవడానికి పూర్తిగా పేటీఎం సహకరించాలి. అందుకు తగిన  సౌకర్యాలు కల్పించాలి. కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్,  ఫాస్టాగ్‌లలో ఉన్న డబ్బును విత్‌డ్రా, లేదా వాడుకోవడానికి కస్టమర్ల పై ఎటువంటి ఆంక్షలు ఉండవు’’ అంటూ ఆర్బిఐ ప్రకటనలో వెల్లడించింది. అందువల్ల ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్లు దానిని వినియోగించలేరు. మార్చి 15 లోగా  నోడల్ అకౌంట్‌ను కూడా సెటిల్ చేయాలని ఆర్బీఐ పేటీఎంను కోరింది.

పేటీఎం అన్ని సర్వీసులు ఫిబ్రవరి 29 వరకు ఎప్పటిలానే పని చేస్తాయి. ఆ తర్వాత నుండి యూపీఐ సేవలను, పేటీఎం వ్యాలెట్ ఉపయోగించేవారికి కొన్ని మార్పులు వర్తిస్తాయి. ముఖ్యంగా, కస్టమర్ల వ్యాలెట్‌లో డబ్బులు ఉంటే ఫిబ్రవరి 29 లోగా వాటిని వేరే అకౌంట్ కు ట్రాన్స్ ఫర్  చేసుకోవచ్చు. అయితే ఈ వ్యాలెట్‌లో డబ్బులు మాత్రం జమ చేయలేరు. ఒకవేళ పేటీఎం ఖాతాను ఏదైనా ఒక థర్డ్ పార్టీ బ్యాంక్‌ తో లింక్ చేసుకున్నట్లయితే పేటీఎం పనిచేస్తుంది. అలాగే యూపీఐ పేమెంట్‌ను సైతం కొనసాగించవచ్చు. థర్డ్ పార్టీ బ్యాంక్ అంటే పేటీఎంలో హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ లేదా పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాంటి గుర్తింపు పొందిన ఏదైనా బ్యాంక్ అకౌంట్ ను ఉపయోగిస్తూ ఉంటే వారికి ఎటువంటి మార్పులు వర్తించవు. పేటీఎం బ్యాంక్‌తో లింక్ ఉన్న వ్యాలెట్‌ను ఉపయోగిస్తూ ఉంటే ఫిబ్రవరి 29 తరువాత ఉపయోగించలేరు.

Also Read: కేంద్ర బడ్జెట్ ప్రకటన…. మధ్యతరగతి వారికి ఊరట…!

 


End of Article

You may also like