కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న అంబాజీపేట మ్యారేజి బ్యాండ్.. ఆరు రోజుల్లో ఊహించని లాభాలు!

కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న అంబాజీపేట మ్యారేజి బ్యాండ్.. ఆరు రోజుల్లో ఊహించని లాభాలు!

by Harika

Ads

నూతన దర్శకుడు దుష్యంత్ కటికనేని డైరెక్ట్ చేసిన అంబాజీపేట మ్యారేజి బ్యాండ్ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సూపర్ డూపర్ హిట్ కొట్టింది. కలెక్షన్ల పరంగా ఊహించని లాభాలని చవిచూస్తుంది. సుహాస్ హీరోగా శివాని హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో శరణ్య, గోపరాజు రమణ, జగదీష్, ప్రతాప్ బండారి తదితరులు కీలకపాత్రలను పోషించారు.

Video Advertisement

చంద్రశేఖర్ స్వరాలు అందించారు. ఫిబ్రవరి 2వ తేదీన విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుంచి మంచి వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి క్లీన్ హిట్గా నిలిచి లాభాల బాట పట్టేసింది. తాజాగా ఆరు రోజుల కలెక్షన్స్ లెక్కలు బయటకు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో 3.18 కోట్ల రేంజ్ లో షేర్ 6.30 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

అలాగే వరల్డ్ వైడ్ గా 4. 19 కోట్ల షేర్ ని 8. 50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని కలెక్ట్ చేసింది. అయితే ఈ సినిమా యొక్క బ్రేక్ ఈవెంట్ టార్గెట్ 3 కోట్లు అయితే ఇది విడుదలైన మూడు రోజుల్లోనే టార్గెట్ ను రీచ్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా 1. 19 కోట్ల లాభాలతో ముందుకు సాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఆరవ రోజు 16 లక్షల షేర్ ని రాబట్టింది ఈ సినిమా. ఇక ప్రపంచవ్యాప్తంగా తెలుగులో 3.08 కోట్లు షేర్ వసూలు చేసింది.

అలాగే ఈ సినిమా కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ ప్రాంతాల్లో కలుపుకొని కేవలం 1.01 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 6 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 4.19 కోట్లు షేర్ తో పాటు 8.50 కోట్లు గ్రాస్ వసూలు అయింది. ఈ సినిమా ఆర్టిస్టుల రెమ్యూనరేషన్ ఇతర ఖర్చులతో కలిపి 10 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించడం గమనార్హం. ఈ సినిమాను సొంతంగా గీత ఆర్ట్స్ ద్వారా రిలీజ్ చేశారు.


End of Article

You may also like