“సమంత” నుండి… “శ్రీయా రెడ్డి” వరకు… సినిమా కోసం సాహసాలు చేసిన 10 హీరోయిన్స్..!

“సమంత” నుండి… “శ్రీయా రెడ్డి” వరకు… సినిమా కోసం సాహసాలు చేసిన 10 హీరోయిన్స్..!

by Mohana Priya

Ads

ఒక సినిమా అన్న తర్వాత చాలా మంది కష్టపడాలి. పాత్ర కోసం వాళ్ళని వాళ్ళు మార్చుకోవాలి. సాధారణంగా సినిమాల్లో హీరోయిన్లకి పాత్ర పరిమితి తక్కువగా ఉంటుంది. చాలా తక్కువగా హీరోయిన్లకి మంచి పాత్రలు వస్తాయి. అందులోనూ పాత్ర కోసం వారిని వారు మార్చుకోవాల్సినలాంటి పాత్రలు మాత్రం ఇంకా తక్కువగా వస్తాయి.

Video Advertisement

అలా వచ్చినప్పుడు ఆ పాత్ర కోసం కష్టపడి వాళ్ళని వాళ్ళు నిరూపించుకుంటేనే వాళ్ళ కెరీర్ లో ఒక మెట్టు పైకి ఎదుగుతారు. అలా మన హీరోయిన్లలో కొంత మంది వాళ్ళ పాత్రల కోసం, అవి సహజంగా రావడం కోసం తమని తాము మార్చుకున్నారు. పాత్ర కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డారు. అలా పాత్రల కోసం వాళ్ళని వాళ్ళు మార్చుకున్న హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

#1 శ్రీయా రెడ్డి

సలార్ సినిమా కోసం శ్రీయా రెడ్డి వెండి జువెలరీ వేసుకోవాల్సి వచ్చింది. ఇయర్ రింగ్స్ బరువు ఎక్కువగా ఉండడంతో చెవులకి గాయాలు అయ్యి కుట్లు కూడా పడ్డాయి. పాత్ర కోసం ఇంత కష్టపడ్డారు.

#2 సప్తమి గౌడ

కాంతార సినిమాలో తన పాత్ర కోసం సప్తమి గౌడ నిజంగానే ముక్కు కుట్టించుకున్నారు.

rishab shetty kantara telugu-movie-story-review-rating

#3 కంగనా రనౌత్

మణికర్ణిక సినిమాలోని ఝాన్సీ లక్ష్మీబాయి పాత్ర కోసం కత్తి యుద్ధాలు నేర్చుకున్నారు. తలైవి సినిమాలో జయలలిత పాత్ర కోసం బరువు పెరిగారు. మళ్లీ వెంటనే బరువు కూడా తగ్గారు.

kangana telugu adda

#4 లిజోమోల్ జోస్

జై భీమ్ సినిమాలోని తన పాత్ర కోసం అక్కడ మాంసాన్ని తినడం వంటివి చేశారు.

lijomol 2

#5 సమంత

రంగస్థలంలో సమంత బర్రెలని తోమే సీన్ ఉంటుంది. నిజంగానే సమంత బర్రెలని నడిపించడం, బర్రెలని తోమడం చేశారు. యశోద కోసం ఫైటింగ్ కూడా నేర్చుకున్నారు.

#6 ప్రియాంక చోప్రా

బర్ఫీ సినిమాలోని తన పాత్ర కోసం ప్రియాంక చోప్రా మాట్లాడలేని, వినిపించని వారి స్కూల్ కి వెళ్లి వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది చూసి తెలుసుకున్నారు. అందుకనే సినిమాలో అంత బాగా నటించారు.

priyanka chopra comments on indian movies

#7 అనుష్క శెట్టి

అరుంధతి కోసం కత్తి యుద్ధాలు నేర్చుకున్నారు. సైజ్ జీరో సినిమా కోసం బరువు పెరిగారు.

#8 రితిక సింగ్

రజినీకాంత్ హీరోగా నటిస్తున్న వెట్టయ్యన్ సినిమాలో రితిక సింగ్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఫైటింగ్స్ నేర్చుకున్నారు. ఇందులో భాగంగా గాయాలు కూడా తగిలాయి. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు.

#9 పూర్ణ

కోడి వీరన్ అనే సినిమాలో పూర్ణ గుండుతో కనిపించే సన్నివేశం ఉంటుంది. ఈ పాత్ర కోసం నిజంగానే పూర్ణ తన జుట్టు తీయించుకున్నారు. సాధారణంగా ఒక హీరోయిన్ ఇలా చేయడం అంటే సాహసం. కానీ పూర్ణ చేశారు.

#10 కృతి సనన్

మిమి అనే సినిమా కోసం గర్భవతిగా కనిపించడానికి కృతి సనన్ 15 కిలోల బరువు పెరిగారు. అది తగ్గడానికి చాలా సమయం పట్టింది అని కూడా చెప్పారు. ఈ సినిమాకి జాతీయ అవార్డు అందుకున్నారు.

వీళ్లు మాత్రమే కాకుండా ఇంకా చాలా మంది హీరోయిన్లు తమ పాత్రల కోసం ఎంతో కష్టపడి గుర్తింపు సాధించారు.

ALSO READ : సినిమా రిలీజ్ అయిన 15 ఇయర్స్ తర్వాత తెలిసిందిగా.? “ఓయ్” అంటే అర్ధం ఇదా.?


End of Article

You may also like