సినిమా రిలీజ్ అయిన 15 ఇయర్స్ తర్వాత తెలిసిందిగా.? “ఓయ్” అంటే అర్ధం ఇదా.?

సినిమా రిలీజ్ అయిన 15 ఇయర్స్ తర్వాత తెలిసిందిగా.? “ఓయ్” అంటే అర్ధం ఇదా.?

by Mohana Priya

కొన్ని సినిమాలు హిట్ అయితే మాత్రమే ప్రేక్షకులకి గుర్తుంటాయి. కొన్ని సినిమాలు హిట్ అయినా కూడా ప్రేక్షకులకు అంత పెద్దగా గుర్తు ఉండవు. అయితే కొన్ని సినిమాలు మాత్రం ఫ్లాప్ అయినా కూడా ప్రేక్షకులకి గుర్తుండిపోతాయి. ఇలాంటి సినిమా ఎందుకు ఫ్లాప్ అయ్యింది? అని డౌట్ మాత్రం ఉండిపోతుంది. అలాంటి సినిమా ఓయ్.

Video Advertisement

సిద్ధార్థ్ హీరోగా నటించిన ఈ సినిమాకి ఆనంద్ రంగా దర్శకత్వం వహించారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన షామిలి ఈ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యారు. ఈ సినిమా ఒక ప్రేమ కథగా రూపొందించారు. ప్రేమ కథ అంటే రెగ్యులర్ టెంప్లేట్ ఉన్న ప్రేమ కథ కాదు. హీరోయిన్, హీరో చివరికి కలుసుకోరు.

reason behind oy movie title

ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీత దర్శకత్వం వహించారు. పాటలు అప్పుడు చాలా పెద్ద హిట్ అయ్యాయి. ఇప్పటికి కూడా ఈ పాటలు చాలా మంది ప్లే లిస్ట్ లో ఉంటాయి. అయితే ఈ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల అవుతోంది. ఈ క్రమంలో దర్శకుడు ఆనంద్ రంగా సినిమాకి సంబంధించి ఒక విషయాన్ని షేర్ చేసుకున్నారు. తన పోస్ట్ లో ఆనంద్ రంగా ఈ విధంగా రాశారు. “ఫిబ్రవరి 14వ తేదీన ఓయ్ సినిమా రీ-రిలీజ్ అవుతోంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కాకపోయినా కూడా ఎవరైనా ఒక్క రివ్యూ చేసే వ్యక్తి ఈ సినిమాలో డీటెయిలింగ్ గురించి చెప్తే నాకు సంతోషంగా అనిపించేది.”

reason behind oy movie title

“ఈ సినిమాకి సంబంధించి కొన్ని విషయాలని నేనే గుర్తు చేసుకుంటున్నాను. మణిరత్నం సినిమాల్లో అమ్మాయి ఓయ్ అని పిలుస్తుంది. ఈ టైటిల్ అందులో నుండే ఇన్స్పైర్ అయ్యింది. మొదట పరుగు సినిమాకి ఈ టైటిల్ నేను సూచించాను. ఎందుకంటే ఈ సినిమాలో హీరో, హీరోయిన్ ఇంట్లో ఉన్నప్పుడు, హీరోయిన్ షెడ్ కి వచ్చిన ప్రతిసారి అలాగే పిలిచి మాట్లాడుతుంది. తర్వాత నేను నా సొంత స్క్రిప్ట్ రాసుకుంటున్నప్పుడు సంధ్య, ఉదయ్ ని ఓయ్ అనే పదంతో పిలవాలి అని నేను అనుకున్నాను. ఇది తెలుగు ఇళ్లల్లో చాలా సాధారణంగా వాడే పదం.”

reason behind oy movie title

“ఇది మాత్రమే కాకుండా మీరు ఇంకొక విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, సంధ్యతో ఉదయ్ ప్రేమకథ అతని బర్త్ డే రోజు, అంటే జనవరి 1వ తేదీ 2007 లో మొదలవుతుంది. ఉదయ్ తండ్రి సంక్రాంతి పండగ సమయంలో చనిపోతారు. (ఆకాశంలో గాలిపటాలు ఎగురుతూ ఉంటాయి). సంధ్య రోజా పూలతో వాలెంటైన్స్ డే రోజు మాట్లాడుతూ ఆ రోజు అందరూ రోజా పూలు వెనకాలే పడతారు అని చెప్తుంది. సినిమాలో ఒక హోలీ సీక్వెన్స్ ఉంటుంది. సమ్మర్ వెకేషన్ లో సంధ్య స్నేహితురాలి కూతుళ్లు ఇంటికి వస్తారు. షిప్ లో వినాయక చవితి జరుగుతుంది.”

reason behind oy movie title

“క్రిస్మస్ కి సంబంధించి ఒక సీన్ ఉంటుంది. డిసెంబర్ 31వ తేదీ రోజు చినుకులు పడుతున్న చోటుకి ఉదయ్ సంధ్యని తీసుకెళ్తాడు. సంధ్య జనవరి 1వ తేదీ 2008 రోజు చనిపోతుంది. అప్పటి నుండి ఉదయ్ తన బర్త్ డే జరుపుకోవడం ఆపేస్తాడు. అంటే ఉదయ్ మొదటి ప్రేమ ఒక్క సంవత్సరం మాత్రమే ఉంది. వన్ ఇయర్ – One Year (OY)” అని రాశారు. అంటే ఇంగ్లీష్ లో వన్ ఇయర్ పదంలో వచ్చే మొదటి రెండు అక్షరాలని కలిపి టైటిల్ పెట్టారు. ఈ సినిమా టైటిల్ ఇలా పెట్టారు అని ఎవరు అనుకోలేదు. దర్శకుడు సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని షేర్ చేశారు.

ALSO READ : అప్పుడు జై భీమ్… ఇప్పుడు ఈ సినిమాతో పాపులర్ అయ్యాడు..! ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా..?


You may also like

Leave a Comment