అప్పుడు జై భీమ్… ఇప్పుడు ఈ సినిమాతో పాపులర్ అయ్యాడు..! ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా..?

అప్పుడు జై భీమ్… ఇప్పుడు ఈ సినిమాతో పాపులర్ అయ్యాడు..! ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా..?

by Mounika Singaluri

జై భీమ్ సినిమా తమిళంలో ఎంత పెద్ద హిట్ కొట్టిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో లాయర్ పాత్రలో నటించిన సూర్యకి ఎంత పేరు వచ్చిందో చిన్న తల్లి పాత్ర పోషించిన లిజోమోల్ జోసీ కి అంతకంటే ఎక్కువ పేరు వచ్చింది.

Video Advertisement

అయితే ఆమె భర్త రాజకన్ను పాత్రలో నటించిన మణికంఠన్ కూడా తన నటన విశ్వరూపం చూపించాడు. ఈ సినిమాలో ఈ చిత్రంలో వీరిద్దరూ ఆదివాసి దంపతులుగా నటించారు. ఈ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హోదా దక్కించుకున్నారు. తమిళంలో ట్రెండ్ సెట్ చేసిన వాళ్ళు ఇద్దరు ఇప్పుడు తెలుగులో కూడా ట్రెండ్ సెట్టర్ గా మారుతున్నారు.

jai bhim hero manikandan

లిజోమోర్ జోసి తెలుగులో ఒరే బామ్మర్ది సినిమాతో అందరినీ అలరించిన విషయం తెలిసినదే. ప్రస్తుతం ఆమె కోలీవుడ్ లో అక్కడి ప్రముఖ స్టార్ నటుడు శశి కుమార్ కి జోడిగా ఒక సినిమా చేయబోతుంది. ఈమెకు అది బిగ్ ఆఫర్ అని చెప్పాలి. ఫ్రీడమ్ అనే మూవీతో మరొకసారి ఆమె తెలుగులోకి రాబోతుంది స్వతంత్ర పోరాటం నేపథ్యంలో సాగే పిరియాడికల్ సినిమా ఇది.

ఈ సినిమా ఫ్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతుంది, జిబ్రాన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ సినిమా హీరో శశి కుమార్ కేవలం నటుడు మాత్రమే కాదు మంచి దర్శకుడు, నిర్మాత. గతంలో ఈయన కోలీవుడ్ లో సుబ్రమణిపురం, నాడోడిగల్, సుందర పాండియన్ వంటి చిత్రాలతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక మణికంఠన్ విషయానికి వస్తే గుడ్ నైట్ సినిమా ద్వారా ఓటిటి ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు.

true lover movie review

నిద్రలో గురక పెడుతూ మిత్రులను ఇబ్బంది పెట్టే పాత్రలో ఆయన జీవించేసారని చెప్పాలి. ఈ చిత్రంలో మోటర్ మోహన్ గా ప్రేక్షకులను నవ్వించడమే కాకుండా ఎమోషనల్ సీన్స్ తో ఏడిపించేసాడు కూడా. అలాగే బేబీ నిర్మాత ఎస్ కే ఎన్ తెలుగులో విడుదల చేసిన ట్రూ లవర్ సినిమాలో మణికంఠన్ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. భవిష్యత్తులో ఈయన సినిమాలకు కూడా తెలుగులో మార్కెట్ ఉండే అవకాశం ఉంది.


You may also like

Leave a Comment