Ads
రైటర్ పద్మభూషణ్ మూవీతోవిజయాన్ని అందుకున్న నటుడు సుహాస్ రీసెంట్ గా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సుహాస్ హీరోగా నటించిన ఈ మూవీలో హీరోయిన్ గా శివాని నగారం నటించగా, శరణ్యా ప్రదీప్ కీలకమైన పాత్రలో నటించింది.
Video Advertisement
ఫిబ్రవరి 2న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ పాజిటివ టాక్ తో దూసుకెళుతోంది. బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ వసూళ్లు సాధిస్తూ తొలి వారంలోనే బ్రేక్ ఈవెన్ అయ్యింది. కొత్త దర్శకుడు దుష్యంత్ కటికనేని దర్శకత్వం వహించిన ఈ మూవీ విలేజ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కింది. థియేటర్లలో ఇప్పటికీ మంచి వసూళ్లు రాబడుతున్న ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతున్నట్టు తెలుస్తోంది.
ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను మొదలుపెట్టిన సుహాస్ కలర్‌ఫొటో మూవీతో హీరోగా మారారు. ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుని, గత ఏడాది రైటర్ పద్మభూషణ్ మూవీతో హిట్ అందుకున్నాడు. తనకంటూ మార్కెట్‌ను, ఫ్యాన్స్ బేస్ ను క్రిియేట్ చేసుకున్నారు. కథల ఎంపికలో వైవిధ్యాన్ని చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. రీసెంట్గా సుహాస్ హీరోగా తెరకెక్కిన అంబాజీపేట మ్యారేజి బ్యాండు టో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.
కులవివక్ష, లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను జోడించి దర్శకుడు ఈ చిత్రాన్ని చక్కగా తెరకెక్కించారు. సొసైటీలోని అంతరాలు, పరువు, ప్రతిష్ట, లవ్ నేపథ్యంలో సాగే మూవీ ఇది. థియేటర్లలో ఇంకా విజయవంతంగా ప్రదర్శించబడుతున్న ఈ సినిమాలో ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ లాక్ అయినట్టు తెలుస్తోంది.
ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన ఆహా ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను సొంతం చేసుకున్నట్లు సమాచారం. థియేటర్లలో విడుదల అయిన నెలరోజుల్లోపే ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఓటీటీ వర్గాల్లో మార్చి 1 నుండి ఆహాలో స్ట్రీమింగ్ కానుందని టాక్. అయితే ఈ విషయం పై ఇప్పటివరకు ఆహా నుండి అధికారిక ప్రకటన రాలేదు.
Also Read: ఒకప్పటి హీరో “సురేష్”…ఇలా మారిపోవడానికి ఫాలో అయిన డైట్ ఏంటో తెలుసా.?
End of Article