Ads
సుమ కనకాల ఈ పేరును తెలుగు ఆడియెన్స్ కు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెరపై యాంకర్ గా ఎన్నో ఏళ్ళ నుండి టాప్ ప్లేస్ లో రాణిస్తూ, ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు.
Video Advertisement
తెలుగు భాషలో అనర్గళంగా మాట్లాడుతూ, చలాకీగా తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తుంటుంది. ఆమె పలు సినిమాలలో కూడా నటించారు. దివంగత స్టార్ హీరోయిన్ సౌందర్యతో కలిసి సుమ ఒక సినిమాలో నటించారు. ఆ సినిమా ఏమిటో ఇప్పుడు చూద్దాం..
సుమ యాంకర్ గా తెలుగులోనే కాకుండా నేషనల్ వైడ్ గా కూడా పాపులారిటీని సొంతం చేసుకుని టాప్ యాంకర్ గా దూసుకుపోతుంది. బుల్లితెర పై యాంకర్ గా తనదైన ముద్రవేసిన సుమ పలు సినిమాలలో సహాయ నటిగా చేశారు. అయితే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మొదట్లో ‘కళ్యాణ ప్రాప్తిరస్తు’ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఆ మూవీలో హీరో వక్కంతం వంశీ. ఆయన ప్రస్తుతం రైటర్ మరియు దర్శకుడిగా రాణిస్తున్నారు.
ఈ చిత్రానికి దర్శకరత్న దాసరి నారాయణ రావు తెరకెక్కించారు. ఆ మూవీ అంతగా ఆడలేదు. దాంతో సుమ పలు సినిమాలలో నటిస్తూ, యాంకర్ గా మారారు. ఒకప్పటి స్టార్ హీరోయిన్ సౌందర్యతో కలిసి ఒక సినిమాలో సుమ నటించారు. ఆ చిత్రం పేరు కలిసి నడుద్దాం. ఈ మూవీ కోడి రామకృష్ణ దర్శకత్వం వహించగా, ఎస్ ఏ రాజ్‌కుమార్ సంగీతం అందించారు. ఈ మూవీలో శ్రీకాంత్ , సౌందర్య హీరోహీరోయిన్లుగా నటించారు . ఈ చిత్రం 2001 రిలీజ్ అయ్యింది.
ఈ చిత్రంలో సుమ హీరోయిన్ సౌందర్యకు బెస్ట్ ఫ్రెండ్ క్యారెక్టర్ చిత్రగా నటించింది. ఈ చిత్రంలో సుమ, సౌందర్య ఉన్న ఒక సీన్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. “ఈ సీన్ లో సుమను కలవడానికి వచ్చిన సౌందర్యతో సుమ గలగల మాట్లాడటం, ఆ తరువాత ఆమె తన భర్తకు బెస్ట్ ఫ్రెండ్ అంటూ సౌందర్యను పరిచయం చేయడం” కనిపిస్తోంది. సుమ వర్షం ,మూవీలో కూడా నటించింది. అందులో ప్రభాస్ అక్కగా కనిపించారు.
End of Article