Ads
ప్రతి వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఒక సినిమాను తీయడానికి దర్శకనిర్మాతలు ఎన్నో కష్టాలు పడుతారు. ఆ చిత్రాన్ని రిలీజ్ చేసి, ఆ మూవీ విజయం సాధిస్తే వాళ్ళ కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది.
Video Advertisement
అయితే ఒక సినిమాను రూపొందించడం ఎంత కష్టమో, ఆ సినిమాని రిలీజ్ చేయడం మరింత కష్టం. అందువల్లే చాలా చిత్రాలు రిలీజ్ కు నోచుకోకుండా ల్యాబ్స్ లోనే పడుంటున్నాయి. ఇప్పుడంటే ఓటీటీలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఒకప్పుడు అలాంటివి లేవు. తప్పనిసరిగా థియేటర్లలో విడుదల చేసుకోవాలి. కారణాలు తెలియనప్పటికి ఇప్పటీ రిలీజ్ కానీ సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1. శాంతి నివాసం:
చిరంజీవి, మాధవి జంటగా నటించిన సినిమా శాంతి నివాసం. బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినా రిలీజ్ కాలేదు. నిర్మాత మరణం వల్ల ఈ మూవీ రిలీజ్ ఆగిపోయింది.
2. ఇంటింటా అన్నమయ్య :
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఇంటింటా అన్నమయ్య అనే సినిమా 2013-14 లో విడుదల కావాల్సింది. కానీ ఇప్పటి వరకు విడుదలకు నోచుకోలేదు.
3. భీమ :
స్టార్ హీరో విక్రమ్, త్రిష జంటగా నటించిన భీమ మూవీ తెరకెక్కింది.ఈ చిత్రానికి లింగుస్వామి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తెలుగు వెర్షన్ ఇప్పటివరకు విడుదల కాలేదు.
4. డీకే బోస్ :
సందీప్ కిషన్ హీరోగా, నిషా అగర్వాల్ హీరోయిన్ గా నటించిన డీకే బోస్ అనే సినిమా 2013-14 సమయంలో విడుదల కావాల్సింది. కానీ ఇప్పటికీ రిలీజ్ కాలేదు.
5. కోతి కొమ్మచ్చి :
రియల్ హీరో శ్రీహరి తనయుడు మేఘాంశ్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ‘కోతి కొమ్మచ్చి’ అనే సినిమా 2020లో విడుదల కావాల్సింది. ఇప్పటికీ విడుదల కాలేదు.
6. జాదు :
7 /జి బృందావన కాలనీ మూవీతో సంచలన విజయన్ని అందుకున్న హీరో రవి కృష్ణ. ఆయన హీరోగా నటించిన సినిమా జాదు. ఇందులో తమన్నా, ఇలియానా హీరోయిన్లుగా నటించారు. 2007 లో విడుదల కావాల్సిన ఈ సినిమా తెలుగు వెర్షన్ ఇప్పటికీ రిలీజ్ కాలేదు.
7. దటీజ్ మహాలక్ష్మీ :
స్టార్ హీరోయిన్ తమన్నా లీడ్ రోల్ లో నటించిన దటీజ్ మహాలక్ష్మీ మూవీ 2019 లో రిలీజ్ కావాలి. కానీ ఇంతవరకు రిలీజ్ కాలేదు.
8. అయినా ఇష్టం నువ్వు :
సీనియర్ నటుడు నరేష్ కుమారుడు నవీన్, కీర్తి సురేష్ జంటగా నటించిన అయినా ఇష్టం నువ్వు మూవీ 2016 లో విడుదల కావాల్సింది. ఇది కీర్తి సురేష్ నటించిన తొలి మూవీ. ఈ మూవీ రిలీజ్ కాలేదు.
9. నా పేరు శివ2 :
కోలీవుడ్ స్టార్ హీరో కార్తి, పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన‘మద్రాసి’సినిమాని తెలుగులో ‘నా పేరు శివ 2’ గా విడుదల చేస్తున్నట్టు 2022 మొదట్లో అనౌన్స్ చేశారు. కానీ ఇప్పటికీ రిలీజ్ కాలేదు.
10. ధృవ నక్షత్రం :
విక్రమ్,రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ధృవ నక్షత్రం మూవీ 2016 లో విడుదల కావాల్సింది. ఇంకా విడుదల కాలేదు.
Also Read: వాలెంటైన్స్ డే రోజు కాబోయే భర్తకు బ్రేకప్ చెప్పిన జబర్దస్త్ నటి…ఆ పోస్ట్ లో ఏముందంటే.?
End of Article