Ads
కొన్ని చిత్రాలు భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతాయి. కానీ థియేటర్లలో అంతగా ఆడవు. కానీ కొన్ని చిత్రాలు సైలెంట్ గా రిలీజ్ అయ్యి, బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధిస్తూ ఉంటాయి. ఇటీవల కాలంలో థియేటర్లలో ఆశించిన విజయం సాధించని సినిమాలు ఓటీటీలో మరియు బుల్లితెర పై బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి.
Video Advertisement
తాజాగా బుల్లితెర పై ప్రసారం అయిన ఆదికేశవ మూవీ గత ఏడాది రిలీజ్ అయ్యి, బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఆ తరువాత ఓటీటీలో కూడా డిజాస్టర్ అయినా ఈ మూవీ టెలివిజన్ లో ప్రసారం కాగా, సూపర్ టిఆర్పి రేటింగ్ తెచ్చుకుంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
థియేటర్లలో లో సూపర్ హిట్ అయిన సినిమాలు సైతం బుల్లితెర పై ప్రసారం అయ్యి, టిఆర్పి రేటింగ్ తక్కువ తెచ్చుకున్నాయి. కానీ డిజాస్టర్ అయిన ఆదికేశవ మూవీ మంచి రేటింగ్ తెచ్చుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వైష్ణవి తేజ్, శ్రీలీల హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీతో మలయాళం స్టార్ హీరో జోజు జార్జ్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ గత ఏడాది నవంబర్ 24న థియేటర్స్ లో విడుదల అయ్యింది. తొలి షోతోనే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమాలోని కథ, సీన్స్ నెట్టింట్లో ట్రోలింగ్ కు మెటీరియల్ అయ్యాయి.
హీరో అతి సన్నివేశాలు, హీరోయిన్ రోల్, అవసరం లేని లాజిక్స్ , ఫైట్లు, కామెడీ, ఓల్డ్ ఫార్మాట్ విలనిజం అన్ని అంశాల పై నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేశారు. 80, 90లలో ఇటువంటి సినిమాని ఎవరు థియేటర్లో చూస్తారంటూ ట్రోల్ చేశారు. అలాంటి మూవీ ఆదివారం నాడు టీవీ ఛానల్ స్టార్ మాలో ప్రసారం అయ్యింది. టీవీల్లో సైతం ఈ సినిమాకి ఆడియెన్స్ షాకిస్తారని అందరు భావించారు. కానీ, ఊహించని విధంగా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ మూవీ 10.29 రేటింగ్ తెచ్చుకుంది. పలు సూపర్ హిట్ చిత్రాలకు కూడా ఈ రేంజ్ లో రేటింగ్స్ రాలేదని తెలుస్తోంది.
Also Read: BHAMAKALAPAM 2 REVIEW : “ప్రియమణి ” నటించిన ఓటీటీ సీక్వెల్ “భామాకలాపం 2” రివ్యూ & రేటింగ్..!
End of Article