SUCCESS STORY: ప్రసవించిన మరుసటిరోజే ఎగ్జామ్ రాసి… సివిల్ జడ్జిగా అర్హత సాధించిన తొలి గిరిజన మహిళ..!

SUCCESS STORY: ప్రసవించిన మరుసటిరోజే ఎగ్జామ్ రాసి… సివిల్ జడ్జిగా అర్హత సాధించిన తొలి గిరిజన మహిళ..!

by kavitha

Ads

సాధించాల‌నే ప‌ట్టుద‌ల, క‌సి ఉంటే ఏదైనా సాధించవచ్చని, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎలాంటి స్థితిలో ఉన్నా అనుకున్నది సాధించవచ్చని 23 ఏళ్ల మహిళ నిరూపించింది. ప్రసవించిన మరుసటి రోజే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ రాసి సివిల్ జడ్జ్ గా  అర్హత సాధించింది.

Video Advertisement

తమిళనాడుకు చెందిన శ్రీపతి అనే మహిళ సివిల్ జడ్జిగా అర్హత సాధించిన తొలి గిరిజన మహిళగా నిలిచింది. తమిళనాడు సిఎం ఎంకే స్టాలిన్ ఆమె సాధించిన విజయానికి అభినందనలు తెలియచేసారు. శ్రీపతి సక్సెస్ స్టోరీ ఇప్పుడు చూద్దాం..

తమిళనాడులోని తిరువణ్ణామలైలోని గిరిజన గూడెంలోని కలియప్పన్‌ అనే రైతుకు మొదటి సంతానంగా శ్రీపతి జన్మించింది.  ఈమె చిన్న వ‌య‌స్సు నుంచే చాలా చురుగ్గా ఉండేది. తిరువణ్ణామలై గిరిజన ప్రాంతాలలో చదువు అంతగా లేదు. శ్రీపతి గూడెం నుండి బస్సు ఎక్కడం కోసం పదిహేను కిలోమీటర్లు దూరం నడవాలి. దాంతో కూతురు చదువు కోసం శ్రీపతి తండ్రి అక్కడి నుండి  యలగిరి హిల్స్‌ కు నివాసం మార్చాడు. అయితే ఇక్కడ కూడా కొండల్లో వ్యవసాయమే జీవనోపాధి. ఇంటర్‌ వరకూ ఉన్న  మిషనరీ స్కూల్‌ అత్తనాపూర్‌లో ఉంది. శ్రీపతి అందులోనే ఇంటర్‌ దాకా చదువుకుంది.

‘చదివి ఏం చేయాలంటా’ అంటూ తోటి గిరిజన తగాకు చెందినవారు ఆమె తండ్రిని, తల్లిని మాటలతో ఇబ్బంది పెట్టేవారు. అయినప్పటికీ వారు శ్రీపతి చదవాల్సిందే అంటూ ప్రోత్సహించారు. ఇంటర్‌లో మంచి మార్కులతో పాస్ అయ్యి,  5 ఏళ్ళ లా కోర్సులో జాయిన్ అయ్యింది.  ఆడపిల్లకు జన్మనిచ్చిన మరుసటి రోజే ‘తమిళనాడు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌’ పరీక్ష రాయడం కోసం యలగిరి హిల్స్‌ నుండి చెన్నైకి భర్త వెంకటేశన్, తండ్రి కలియప్పన్‌ తోడుగా కారులో బయలుదేరింది.

పచ్చి బాలింత అయినా నాలుగున్నర గంటల పాటు ప్రయాణించి ఎగ్జామ్‌ రాసింది. ఆ పరీక్షలో పాస్ అయ్యి ‘సివిల్‌ జడ్జ్‌’  కు అర్హత సాధించింది. ఆమెకు ముఖ్యమంత్రి స్టాలిన్ అభినందనలు తెలిపారు. ఆమె మాట్లాడుతూ “గిరిజనులకు ఎటువంటి చట్టబద్ధమైన హక్కులు ఉన్నాయనే విషయం వారికి తెలియదు. ఆ విషయంలో వారిని చైతన్యవంతం చేసి, వారి హక్కులను పొందేలా చేయాలి. ఆ ఉద్దేశ్యంతోనే లా చదవాలని భావించానని వెల్లడించింది. ఆమె సక్సెస్ స్టోరీ నెట్టింట్లో వైరల్ గా మారింది.

Also Read: ఎందుకు ఇలా చేసావు జడ్డూ..? నీ క్రికెట్ కెరీర్ కోసం ఆయన కష్టపడితే.. నువ్వు మాత్రం..?

 


End of Article

You may also like