ఎందుకు ఇలా చేసావు జడ్డూ..? నీ క్రికెట్ కెరీర్ కోసం ఆయన కష్టపడితే.. నువ్వు మాత్రం..?

ఎందుకు ఇలా చేసావు జడ్డూ..? నీ క్రికెట్ కెరీర్ కోసం ఆయన కష్టపడితే.. నువ్వు మాత్రం..?

by kavitha

Ads

భారత ఆల్‌‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు రచ్చకెక్కిన విషయం తెలిసిందే. జడేజా తండ్రి అనిరుధ్‌ సింహ్ తన కుమారుడు జడ్డూ మరియు కోడలు రివాబా పై సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచారు.

Video Advertisement

ఆ తరువాత తండ్రి ఆరోపణలపై రవీంద్ర జడేజా కూడా ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. ఈ విషయం పై నెట్టింట్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. తాజాగా రవీంద్ర జడేజా చేసిన పనికి,  నెటిజెన్లు జడ్డూ ఎందుకు ఇలా చేసావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

రాజ్‌కోట్‌ టెస్టు మ్యాచ్ కు ముందు జడేజా , అతని రివాబా పై జడేజా తండ్రి అనిరుద్‌ సిన్హ ఆరోపణలు చేశాడు. వివాహం అయిన తర్వాత జడేజా మారిపోయాడని అన్నారు. కోడలు రివాబా రాకతో టం ఫ్యామిలీ విఛ్చిన్నం అయ్యిందని, ప్రస్తుతం తాను, జడేజా మాట్లాడుకోవడం లేదని, ఇద్దరం వేరుగా ఉంటున్నామని వెల్లడించాడు. కనీసం మనవరాలిని కూడా ఒక్కసారి చూడనివ్వడం లేదు. తాను కష్టపడి కొడుకుని క్రికెటర్‌ను చేశానని ఆవేదన వ్యక్తం చేశాడు.  జడేజా సంపాదన పై భార్య రివాబా, అత్తమామలు పెత్తనం చేస్తున్నారని ఆరోపణలు చేశారు.

అయితే తండ్రి  ఆరోపణల పై రవీంద్ర జడేజా సోషల్‌ మీడియా వేదికగా ఘాటుగా స్పందించాడు. తన వైఫ్, బీజేపీ ఎమ్మెల్యే రివాబా పై బురద జల్లడం కోసమే ఇటువంటి పెయిడ్‌ ఇంటర్వ్యూలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో భారత జట్టు ఆల్‌రౌండర్‌ గా జడేజా అదరగొట్టాడు. గాయం నుండి కోలుకున్న జడ్డూ సొంత మైదానం అయిన ‘రాజ్‌కోట్‌’ జట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషించి, ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు పొందాడు. తనకు వచ్చిన అవార్డును భార్య రివాబాకు అంకితమిచ్చాడు.

జడ్డూ అవార్డ్ ను అంకితం ఇచ్చి భార్య పై తన ప్రేమను మరోసారి చాటుకున్నాడని ఫ్యాన్స్ నెట్టింట్లో కామెంట్స్ చేస్తున్నారు. అయితే కొందరు నెటిజన్లు ‘‘జడ్డూ పనులు అతడి తండ్రి అనిరుధ్‌ సింహ్ ని ఇంకా బాధపెట్టేవిగా మరియు రెచ్చగొట్టేలా  ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. కొందరు జడేజా క్రికెటర్‌గా ఎదగడంలో అతని తండ్రి మరియు సోదరి ముఖ్య పాత్ర పోషించారని అతనే గతంలో చెప్పాడు’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Also Read: IPL 2024 : CSK కి బ్రాండ్ అంబాసిడర్ గా ఇండియాలోనే టాప్ హీరోయిన్..! ఎవరో తెలుసా..?

 


End of Article

You may also like