IPL 2024 : CSK కి బ్రాండ్ అంబాసిడర్ గా ఇండియాలోనే టాప్ హీరోయిన్..! ఎవరో తెలుసా..?

IPL 2024 : CSK కి బ్రాండ్ అంబాసిడర్ గా ఇండియాలోనే టాప్ హీరోయిన్..! ఎవరో తెలుసా..?

by Mohana Priya

Ads

భారతదేశంలో ఎక్కువగా క్రేజ్ ఉండేది రెండిటికే. ఒకటి సినిమా. ఒకటి క్రికెట్. ఇవి రెండు ఎమోషన్స్. అందులోనూ క్రికెట్ లో వరల్డ్ కప్, ఐపీఎల్ వంటి వాటికి అభిమానులు ఇంకా ఎక్కువ మంది ఉంటారు. ఐపీఎల్ సీజన్ వచ్చేస్తోంది. ఇప్పటికే సెలక్షన్ కూడా జరిగింది.

Video Advertisement

అందులో కొంత మంది ప్లేయర్ల ఎంపిక నిరాశపరిచినా కూడా, ఇంకొంత మంది ప్లేయర్ల ఎంపిక సరిగ్గానే చేశారు అనిపించింది. అయితే ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సంబంధించి ఒక వార్త బయటకు వచ్చింది. ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి బ్రాండ్ అంబాసిడర్ గా ఒక హీరోయిన్ ఉండబోతున్నారు.

ఆ హీరోయిన్ భారతదేశం సినిమా ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్ గా పేరు పొందారు. ఆమె మరెవరో కాదు. కత్రినా కైఫ్. కత్రినా కైఫ్ అనే వ్యక్తి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎక్కువగా బాలీవుడ్ సినిమాల్లో నటించిన కత్రినా కైఫ్, కొన్ని టాలీవుడ్ సినిమాల్లో కూడా నటించారు. వెంకటేష్ హీరోగా నటించిన మల్లీశ్వరి సినిమాతో తెలుగులో నటించారు కత్రినా కైఫ్. ఆ తర్వాత బాలకృష్ణ హీరోగా నటించిన అల్లరి పిడుగు సినిమాలో కూడా నటించారు.

list of katrina kaif's boyfriends..!!

బాలీవుడ్ లో అయితే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. కత్రినా కైఫ్ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 సంవత్సరాలు అయ్యింది. ఇప్పటికి కూడా కత్రినా కైఫ్ వరుస పెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల టైగర్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఇప్పుడు మరికొన్ని సినిమాలు కూడా చేస్తున్నారు. ఒకవైపు గ్లామరస్ పాత్రలు చేస్తూనే, మరొక వైపు నటనకి ఆస్కారం ఉన్న సినిమాలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు కూడా పెద్ద సినిమాలు అంటే, అందులో హీరోయిన్ ఎంపిక జాబితాలో కత్రినా కైఫ్ పేరు ఉంటుంది.

అంటే ఆమె క్రేజ్ ఇప్పటికీ కూడా ఎంత ఎక్కువగా ఉంది అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. దాంతో అంత క్రేజ్ ఉన్న నటిని బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకుంటున్నారు అంటే ఇది జట్టుకి ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. అంతే కాకుండా చెన్నై సూపర్ కింగ్స్ జెర్సీ మారింది అని చెప్తున్నారు. మరి ఈ విషయాల్లో ఎంత నిజం ఉంది అనేది ఇంకా తెలియదు. అందుకే ఈ విషయాల మీద అధికారిక ప్రకటన వచ్చేంతవరకు ఆగాల్సిందే.

ALSO READ : అప్పుడు జై భీమ్… ఇప్పుడు ఈ సినిమాతో పాపులర్ అయ్యాడు..! ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా..?


End of Article

You may also like