Ads
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి నిన్న ఘనంగా జరిగింది. బాలీవుడ్ ప్రొడ్యూసర్, నటుడు జాకీ భగ్నాని తో, రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి జరిగింది.
Video Advertisement
వీరిద్దరూ గత 3 సంవత్సరాల నుండి ప్రేమలో ఉన్నారు. రకుల్ ప్రీత్ సింగ్ తన పుట్టినరోజు నాడు 2021 లో తన రిలేషన్ షిప్ గురించి ప్రకటించారు.
ఆ తర్వాత వీళ్లిద్దరూ కలిసి చాలా చోట్ల కనిపించారు. దాంతో రకుల్ ప్రీత్ సింగ్ త్వరలోనే పెళ్లి చేసుకుంటారు అనే వార్త రావడం మొదలు అయ్యింది. కానీ అవన్నీ కూడా పుకార్లు అని, దానికి ఇంకా సమయం ఉంది అని రకుల్ చాలా సార్లు చెప్పారు. ఇప్పుడు కూడా అలాంటి వార్త వచ్చింది. కానీ ఇది కూడా నిజమా కాదా అని చాలా మందికి తెలియలేదు. నిన్న సడన్ గా సోషల్ మీడియా ద్వారా తన పెళ్లి ఫోటోలని పోస్ట్ చేసి, ఈ వార్తని షేర్ చేసుకున్నారు రకుల్ ప్రీత్ సింగ్. పంజాబీ-సింధీ పద్ధతుల్లో వీరి పెళ్లి జరిగింది.
వీరి పెళ్లి గోవాలో జరిగింది. ఐటీసీ గ్రాండ్ గోవా రిసార్ట్ అండ్ స్పా లో వీరి పెళ్లి జరిగింది. ఈకో ఫ్రెండ్లీ ఫీచర్స్ అంటే, సహజంగా రూపొందించబడ్డ ప్రదేశాలు, నీటిని సప్లై చేసే విధానం, అక్కడ వాడే ఎనర్జీ, వాతావరణం, హోటల్ లో ఉండే నిత్యావసరాల కోసం వాడిన ప్రొడక్ట్స్ యొక్క క్వాలిటీ, అక్కడి నేటివిటికి తగ్గట్టు రూపొందించిన విధానం, డిజైన్ చేసిన పద్ధతి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని పైన చెప్పినవన్నీ కూడా కరెక్ట్ గా ఉంటే లీడ్ ప్లాటినం సర్టిఫికెట్ ఇస్తారు. అంటే ఇది ఒక ఎకో ఫ్రెండ్లీ హోటల్. ఇందులో వీరు చేసే ఈవెంట్స్ వల్ల కానీ, లేదా వాడే వస్తువుల వల్ల కానీ పర్యావరణానికి ఎటువంటి హాని జరగదు. ఇలాంటి హోటల్ ని రకుల్ ప్రీత్ సింగ్ వాళ్లు పెళ్లి కోసం ఎంచుకున్నారు.
ఇది ఇలా ఉంటె…ఈ వెడ్డింగ్ కి ఫోటోగ్రాఫర్ “జోసెఫ్ రాధిక్”. తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది సెలబ్రిటీల పెళ్లిళ్లకి జోసెఫ్ ఫోటోలు తీశారు. డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఫోటోగ్రఫీలో ఈయన స్పెషలిస్ట్. ఉపాసన – రామ్ చరణ్, అల్లు అర్జున్ – స్నేహ రెడ్డి, విగ్నేష్ శివన్ – నయనతార, ప్రియాంక చోప్రా – నిక్ జోనస్ ఇలా వీళ్ళందరి పెళ్ళిళ్ళకి కూడా జోసఫ్ ఫోటోగ్రఫీ చేశారు. స్వతహాగా తెలుగువారు అయిన జోసెఫ్, ప్రపంచవ్యాప్తంగా తన ఫోటోగ్రఫీ ద్వారా ఫేమస్ అయ్యారు. స్టోరీస్ బై జోసెఫ్ రాధిక్ పేరుతో తన సొంత ఫోటోగ్రఫీ స్టూడియో స్థాపించారు. ఇటీవల వైయస్ షర్మిల కొడుకు పెళ్లి ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. రాజారెడ్డి – ప్రియ వివాహానికి జోసెఫ్ ఫోటోగ్రాఫర్ గా వ్యవహరించారు. ఈ ఫోటోలని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
జోసెఫ్ ఒక్క పోర్ట్రైట్ ఫోటో సెషన్ కి లక్షా పాతిక వేల రూపాయలు తీసుకుంటారు అని సమాచారం. అదనంగా టాక్స్ చార్జీలు కూడా పడతాయి. ఇది కేవలం ఒక్క ఫోటో సెషన్ కి మాత్రమే. పెళ్లి అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన ఫోటో సెషన్ ఉంటుంది. అలా చూసుకుంటే దాదాపు 5 లక్షల వరకు తీసుకుంటారు. అయితే ఒక ఈవెంట్ లో ఎన్నో ఫోటో సెషన్స్ అవుతాయి కాబట్టి దాదాపు 15-20 లక్షల వరకు తీసుకునే అవకాశం ఉంది. కానీ ఫోటోలు కూడా అంతే క్వాలిటీ గా ఉంటాయి. అందుకే ఈ ఫోటోగ్రాఫర్ కి అంత మంది అభిమానులు ఉన్నారు. సెలబ్రిటీలు కూడా జోసఫ్ ఫోటోగ్రఫీ కావాలి అని అనుకుంటారు.
Also read: “గోవా”లో రకుల్ పెళ్లి చేసుకున్న ఆ రిసార్ట్ లో… ఒక్క రోజుకి ఒక గది ధర ఎంతో తెలుసా.?
End of Article