Ads
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర పేరు గాంచింది. తెలంగాణ కుంభమేళ అయిన మేడారం జాతర 4 రోజుల పాటు జరుగుతుంది. వనాల నుండి ప్రజల మధ్యకు వచ్చిన వనదేవతలను దర్శించుకోవడానికి మేడారంకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు.
Video Advertisement
గత 3 రోజులుగా భక్తులతో పూజలు అందుకున్న సమ్మక్క, సారలమ్మలు ఈరోజు వన ప్రవేశం చేయబోతున్నారు. ఈ వనప్రవేశంతో జాతర ముగియనుంది. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతరలో కోట్లలో బిజినెస్ జరుగుతుందన్న విషయం తెలిసిందే. ఈ మేడారం జాతర ఒక మహిళ లైఫ్ ని మార్చేసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
తెలంగాణ కుంభమేళగా పిలిచే, మేడారం జాతరకు తెలంగాణ నుండే మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి లక్షలాది భక్తులు తరలి వస్తుంటారు. గత 3 రోజులుగా సమ్మక్క సారక్క దేవతలను కోటిమందికి పైగా భక్తులు దర్శించుకున్నట్లు తెలుస్తోంది. మేడారం జాతర సమయంలో కోట్లలో వ్యాపారం జరుగుతుంది. మేడారం జాతర ప్రారంభం అయినప్పటి నుండి అక్కడ చాలామంది చాలా రకాల వ్యాపారాలను చేస్తుంటారు. అయితే ముఖ్యంగా బంగారం (బెల్లం), కొబ్బరి కాయల వ్యాపారం బాగా సాగుతుంది. అమ్మవారికి బెల్లాన్ని బంగారంగా భక్తులు సమర్పిస్తుంటారు.
మేడారం జాతర ఒక మహిళ లైఫ్ ను మార్చింది. ఆమె మాట్లాడుతూ” మేడారం జాతర ఒక రకంగా నా లైఫ్ ను మార్చింది. 3 ఏళ్ళ నుండి కొబ్బరి కాయల వ్యాపారం చేస్తున్నాను. బాగానే లాభాలు ఉన్నాయి. ఈ వ్యాపరం బాగా సెట్ అయ్యింది. ఆ అమ్మవారి ఆశీస్సుల వల్ల బిజినెస్ బాగా సాగుతుంది. కొబ్బరికాయలను ఆంధ్రప్రదేశ్, తమిళ నాడు నుండి తెప్పిస్తుంటాము. జాతరలో కొబ్బరి కాయలు 50 రూపాయాలకు అమ్ముతాము.
దేవస్థానం ధర 40 రూపాయాలు, కుంకుమ, పసుపుతో పాటు కొబ్బరికాయలకు రూ. 50 తీసుకుంటామని అన్నారు. ఇక్కడ బిజినెస్ నిర్వహిస్తున్నందుకు 28 రోజులకు గాను గ్రామ పంచాయితీకి ప్రతిరోజూ లక్ష చొప్పున 28 లక్షల రూపాయలను చెల్లిస్తామని చెప్పారు. గత మేడారం జాతరకు వ్యాపారంలో లాభాలు మంచిగా వచ్చాయి. కొన్నిసార్లు ఈ బిజినెస్ లో నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రతిసారి ఈ జాతరకు వచ్చి వ్యాపారం సాగిస్తాము. మేడారం జాతర వల్ల చాలామంది వ్యాపారం చేసుకుని బతుకుతున్నారు” అంటూ చెప్పుకొచ్చారు.
End of Article