SUCCESS STORY: ఎంసెట్ లో 186 ర్యాంక్…ప్లేసెమెంట్స్ లో 50 లక్షల ప్యాకేజీ..! ఈ హైదరాబాద్ అమ్మాయి సక్సెస్ స్టోరీ ఏంటంటే.?

SUCCESS STORY: ఎంసెట్ లో 186 ర్యాంక్…ప్లేసెమెంట్స్ లో 50 లక్షల ప్యాకేజీ..! ఈ హైదరాబాద్ అమ్మాయి సక్సెస్ స్టోరీ ఏంటంటే.?

by kavitha

Ads

నేటి యువత గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ,  కాలక్షేపం చేయకుండా తమ చదువుతో పాటు ఇతర కోర్సులు చేసి, ప్రైవేట్ ఉద్యోగాల వైపు వెళ్తున్నారు. చిన్న వయసులోనే పెద్ద పెద్ద కంపెనీల్లో  మంచి ప్యాకేజీతో జాబ్స్ ను సాధిస్తున్నారు. వారి కలను నెరవేర్చుకోవమే కాకుండా వారి తల్లిదండ్రులకు తమ భవిష్యత్తు పై ఉన్న చింతను తీరుస్తున్నారు.

Video Advertisement

ప్రధానంగా ఐటి రంగంలో మంచి ప్యాకేజీతో జాబ్ లభిస్తే, వారి జీవితం సెట్ అయినట్టే. వారు అప్పటి దాకా పడిన కష్టాన్ని సైతం  పోగొట్టేది ఉద్యోగం మరియు ప్యాకేజీ అని చెప్పవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం రెసిషన్ పీరియడ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.  దీనివల్ల పెద్ద కంపెనీలన్ని ఉద్యోగులను తొలగిస్తున్నాయి. కొత్తగా జాబ్స్ దొరకడం చాలా కష్టంగా మారింది.

ఇలాంటి తరుణంలో ఒక అమ్మాయి పదో, ఇరవై కాకుండా ఏకంగా50 లక్షల రూపాయల ప్యాకేజీతో జాబ్ ను సాధించింది. ఆమెనే చల్లా సాయి కృతి. సాయి కృతి హైదరాబాద్ లోని జేఎన్టీయూ స్టూడెంట్. ప్లేస్‌మెంట్స్ లో  ప్రముఖ ఐటీ  సంస్థ డీఈషా గ్రూప్‌లో  52 లక్షల రూపాయల వార్షిక వేతనంతో జాబ్ ను సాధించింది. సాయికృతి మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. చిన్నప్పటి నుండి హైదరాబాద్ లోనే చదువుకున్నానని, ఆమె తండ్రి మహీధర్ ప్రాజెక్ట్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నారని వెల్లడించింది.తల్లి ఉషారాణి గృహిణి, అక్క సుచిత సైతం ఐటీ ఇండస్ట్రీలో పనిచేస్తుందని అన్నారు. మానసికంగా తన ఎదుగుదలలో ఫ్యామిలీ మెంబర్స్ పాత్ర కీలకమని ఆమె  చెప్పుకొచ్చారు. చదువు విషయంలో ఎప్పుడూ ఇంట్లో నుండి ఒత్తిడి లేదని, టెన్త్ క్లాస్ లో 10 పాయింట్లు వచ్చినట్టుగా తెలిపారు. ఇంటర్మీడియట్ లో  985 మార్కులు తెచ్చుకున్నట్లు తెలిపారు. ఎంసెట్ లో 186వ ర్యాంక్ వచ్చిందని, సాఫ్త్ వేర్ ఫీల్డ్ పై ఉన్న ఇంట్రెస్ట్ తో జేఎన్టీయూలో కంప్యూటర్ సైన్స్ లో చేరినట్టు తెలిపింది.

జాబ్ కోసం 3 రౌండ్లలో ఇంటర్వ్యూ జరిగిందని, ఆన్ లైన్ టెస్ట్ కాలేజ్ లోనే పెట్టారని, ఐదుగురు ఫైనల్ రౌండ్ కు హాజరైతే తను మాత్రమే ఎంపికవడం సంతోషంగా ఉందని  చెప్పుకొచ్చారు. టెక్స్ట్ బుక్స్  చదవడానికే ఎక్కువ శాతం ప్రాధాన్యత ఇచ్చానని అన్నారు. ఇంటర్వ్యూకు వెళ్ళడానికి ముందు కోర్ సబ్జెక్ట్ లు ఎక్కువగా చదివానని, ఓపికగా ప్రయత్నిస్తే విజయం దక్కుతుందని సాయికృతి వెల్లడించారు. ఆమె పై నెట్టింట్లో ప్రశంసలు కురుస్తున్నాయి.

Also Read: నేను చేసిన తప్పు ఇలా అవుతుందనుకోలేదు…10 రోజులుగా హాస్పిటల్ లో నరకం చూస్తున్నా అంటూ ప్రియాంక సింగ్.!


End of Article

You may also like