Ads
శుక్రవారం వచ్చిందంటే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో పలు చిత్రాలు,వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతుంటాయనే విషయం తెలిసిందే. వివిధ భాషల్లో విడుదలై సూపర్ హిట్ అయిన సినిమాలు సైతం ఓటీటీలలో సందడి చేస్తున్నాయి. ఎప్పటిలానే ఈ వారం కూడా పలు సినిమాలు, సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి.
Video Advertisement
అయితే తమిళంలో సూపర్ హిట్ అయిన ఒక సినిమా ఎలాంటి ప్రకటన ముందుగా చేయకుండానే సైలెంట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో స్టార్ కథానాయక మీనాక్షిచౌదరి నటించింది. ఆ మూవీ ఏమిటో? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ఇప్పుడు చూద్దాం..
ఆర్‌జే బాలాజీ, మీనాక్షిచౌదరి ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం సింగపూర్ సెలూన్. ఈ తమిళ మూవీ అంచనాలు ఏమాత్రం లేకుండా జనవరి 25న రిలీజ్ అయ్యి, సూపర్ హిట్ అయ్యింది. బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ సాధించింది. ఈ చిత్రంలో సత్యరాజ్, లాల్ ముఖ్య పాత్రలు చేశారు.
తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ అతిథి పాత్రలో కనిపించాడు. ఆయనతో పాటు అరవింద్ స్వామి, హీరో జీవా సైతం అతిథి పాత్రల్లో కనిపించారు. ఈ మూవీకి హిట్ టాక్ రావడంతో తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ అది కుదరలేదు. అయితే సింగపూర్ సెలూన్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది.
ఈ నేపథ్యంలో ముందస్తు ప్రకటన లేకుండానే ఫిబ్రవరి 23 అర్ధ రాత్రి నుండి ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. ప్రస్తుతానికి ఈ మూవీ తమిళ వెర్షన్ లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. డబ్బింగ్ సినిమాలకు తెలుగు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో త్వరలో ఈ మూవీ తెలుగు వెర్షన్ కూడా రావచ్చు.
End of Article