“ఆడ‌దానికి  స్వాతంత్య్రం ఎందుకు కావాలి.?” అంటూ… సీనియర్ నటి “అన్నపూర్ణ” కామెంట్స్..! ఇందుకు సింగర్ చిన్మయి ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ ఏంటంటే..?

“ఆడ‌దానికి  స్వాతంత్య్రం ఎందుకు కావాలి.?” అంటూ… సీనియర్ నటి “అన్నపూర్ణ” కామెంట్స్..! ఇందుకు సింగర్ చిన్మయి ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ ఏంటంటే..?

by kavitha

Ads

సీనియర్ నటి అన్నపూర్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె వందలాది చిత్రాలలో నటించి మెప్పించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అన్నపూర్ణ చేయని క్యారెక్టర్ లేదని చెప్పవచ్చు.  అప్పటి అగ్ర హీరోల సినిమాల నుండి ఇప్పటి యంగ్ హీరోల సినిమాల వరకు నటిస్తూ ఆకట్టుకుంటున్నారు.

Video Advertisement

ప్ర‌స్తుతం అన్నపూర్ణ బామ్మ క్యారెక్టర్లలో నటిస్తూ ఆడియెన్స్ ను అలరిస్తున్నారు. అయితే తాజాగా అన్నపూర్ణ ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. అన్నపూర్ణ చేసిన కామెంట్స్ పై సింగర్ చిన్మయి సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

అన్నపూర్ణ ఈ తరం అమ్మాయిల గురించి ఒక ఇంటర్వ్యూలో కామెంట్స్ చేశారు. అందులో  “అసలు అర్ధ‌రాత్రి స్వ‌తంత్రం అన‌గానే ఆరోజుల్లో ఆడ‌వాళ్లు బ‌య‌ట‌కు వ‌చ్చేవాళ్లా.? ఆడ‌దానికి  స్వాతంత్య్రం ఎందుకు కావాలి.? రాత్రి 12 గంట‌ల‌ త‌ర్వాత  ఆడవాళ్లకు ఏం ప‌ని.? ఇప్పుడు ఎక్స్‌పోజింగ్ అలా ఉంది” అంటూ అన్నపూర్ణ కామెంట్స్ చేశారు.  అయితే ఆమె మాట్లాడిన  మాటలు ఆడ‌వాళ్ల‌ను కించపరిచే విధంగా ఉన్నాయంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సింగర్ చిన్మయి అన్నపూర్ణ మాటల పై స్పందించారు. 

చిన్మయి అన్నపూర్ణ మాట్లాడిన వీడియోను షేర్ చేస్తూ, ఇలా చెప్పుకొచ్చారు. “నేను అన్నపూర్ణ యాక్టింగ్ కి అభిమానిని. ఆమె ఇటువంటి కామెంట్స్ చేస్తే, నా మనసు ముక్క‌లైన‌ట్లుగా  అనిపిస్తోంది. ఫేవ‌రెట్ అయిన ఆమె ఇలా మాట్లాడితే భరించలేకపోతున్నాను. ఆమె మాట్లాడిన దాని ప్ర‌కారంగా, ఏదైనా ఆరోగ్యానికి సంబంధించిన ఎమ‌ర్జెన్సీ అయినా, ప్రమాదం జరిగినా ఉదయం నుండి సాయంత్రం మధ్యలో మాత్రమే జ‌ర‌గాలి. అనంతరం  మహిళా డాక్ట‌ర్స్‌, న‌ర్సులు ఉండకూడదు అనేలాఉంది. ఆమె అన్నట్లుగా నైట్ టైమే లో లేడి డాక్ట‌ర్లే ఉండొద్దు.  హెల్త్ బాలేక‌పోయినా నైట్ హాస్పటల్ లో ఉండ‌కూడ‌దు.

ఆమె చెప్పిన నియమం ప్ర‌కారం అర్ధ‌రాత్రి పిల్ల‌లు సైతం  పుట్ట‌కూడ‌దు. ఎందువల్ల అంటే గైన‌కాల‌జిస్టులు ఉండ‌రు.  ఉండొద్దు కాబ‌ట్టి, ఇప్పటికీ ఇంట్లో బాత్రూం లేక‌పోవడంతో తెల్లవారుజామునే మూడు  గంట‌ల‌కు పొలం గ‌ట్టుకు వెళ్ళే మహిళలు ఉన్నారు. చాలా ఊర్ల‌లో ఇప్ప‌టికీ బాత్రూమ్స్ కూడా లేవు. ఇటువంటి సంద‌ర్భాల్లో మహిళలు ఎప్పుడు వ‌స్తారా? ఎప్పుడు వాళ్ల‌పై అఘాయిత్యానికి పాల్ప‌డుదామా అని వెయిట్ చేస్తున్నవాళ్ళు  ఎంతో మంది ఉన్నారు. అమ్మాయిల డ్రెస్సింగ్ కారణంగానే అఘాయిత్యాలు జ‌రుగుతున్నాయ‌ని అంటున్నారు. భారత్ లో అమ్మాయిలుగా జన్మించడం మ‌న క‌ర్మ” అంటూ చిన్మయి చెప్పుకొచ్చారు.

Also Read: 1977 లోనే 20 లక్షల బడ్జెట్ తో తీసిన సీనియర్ ఎన్టీఆర్ సినిమా… ఎన్ని కోట్ల లాభాల్ని తెచ్చిపెట్టిందో తెలుసా.?


End of Article

You may also like