Ads
రోజు రోజుకు సోషల్ మీడియా యూసెజ్ పెరుగుతూనే ఉంది. నెట్టింట్లో ఏది ఎప్పుడు, ఎలా వైరల్ గా మారుతుందో తెలియని పరిస్థితి. ఇక సినిమాల్లోని డైలాగ్స్, సీన్స్ అయితే ఓ రేంజ్ లో వైరల్ అవుతాయో తెలిసిందే. పాత సినిమాలలోని సీన్స్ ను కూడా మీమర్స్ తెగ వాడేస్తున్నారు.
Video Advertisement
పదేళ్ళ క్రితం వచ్చిన సినిమాలలోని విషయాల పై కూడా మీమ్స్ క్రియేట్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. తాజాగా ఓ సినిమాలో బ్రహ్మానందం పేరుని ఎందుకు అలా పెట్టారో కనిపెట్టి, సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మీమ్స్ లో అధికశాతం స్టార్ కమెడియన్ బ్రహ్మానందం కు సంబంధించినవే ఉంటాయనే విషయం సోషల్ మీడియా వాడే ప్రతి ఒక్కరికీ తెలిసిందే. నెట్టింట్లో కడుపుబ్బా నవ్వించే మీమ్స్, ట్రోల్స్ లో తప్పనిసరిగా బ్రహ్మానందం ఉంటారు. బ్రహ్మనందం లేకుండా ట్రోలర్స్, మీమర్స్, వాటిని చూసి నవ్వుకునే నెటిజెన్లకి రోజుగడవదు.
ఈ మధ్య కాలంలో ఓటీటీలు వాడకం కూడా బాగా పెరిగింది. ఓటీటీలో సినిమాలు ఒకటి కంటే ఎక్కువ సార్లు చూస్తూ, వాటిలోని మిస్టేక్స్ ని కనిపెట్టడం, ఒక సినిమాకి ఇతర సినిమాలకి ఉన్న పోలికలు కనిపెట్టడం, సినిమా మధ్య ఉన్న కనెక్షన్స్ ని కనిపెట్టడం లాంటివి చేస్తూ, వాటిని మీమ్స్ రూపంలో పాపులర్ డైలాగ్స్ ని కూడా యాడ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడం ఎక్కువైంది. ఈ క్రమంలోనే తాజాగా కిక్ మూవీలో బ్రహ్మనందంకు సంబంధించిన మీమ్ వైరల్ గా మారింది.
2009 లో రిలీజ్ అయిన కిక్ మూవీలో బ్రహ్మనందం కామెడీ సీన్స్ ఎంతగా క్లిక్ అయ్యాయో తెలిసిందే. ఈ మూవీలో ఒక సీన్ లో కిక్ లో ఒక సీన్ లో బ్రహ్మనందం “నేను పరుగు ప్రకాష్ రాజ్” అని చెబుతాడు. అయితే ఆ సీన్ లో బ్రహ్మనందం హెయిర్ స్టైల్, పరుగు మూవీలో ప్రకాష్ రాజ్ హెయిర్ స్టైల్ ఒకేలా ఉంటుంది. అందుకే ఆ పేరు పెట్టారా అని నెట్టింట్లో మీమ్స్ వేస్తున్నారు. సోషల్ మీడియా లో ఇలాంటివి బాగానే కనిపెడతున్నారు. వాటికి నెటిజెన్లు కూడా తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: “వైవా హర్ష” లాగే… హీరోలుగా చేసి ఫెయిల్ అయిన 8 మంది స్టార్ కమెడియన్లు వీరే.!
End of Article