“డాడీ” సినిమా ఎన్నోసార్లు చూసే ఉంటారు…కానీ ఇది గమనించలేదు అనుకుంటా.? ఆ స్టార్ హీరో.?

“డాడీ” సినిమా ఎన్నోసార్లు చూసే ఉంటారు…కానీ ఇది గమనించలేదు అనుకుంటా.? ఆ స్టార్ హీరో.?

by kavitha

Ads

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి నటిస్తే చూడాలని అనుకొని తెలుగు ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు.’ మెగాస్టార్ నటించిన శంకర్ దాదా జిందాబాద్‌ మూవీ క్లైమాక్స్ లో ఈ ఇద్దరు కలిసి 10 నిమిషాల పాటు కనిపిస్తేనే థియేటర్లన్ని దద్దరిల్లాయి.

Video Advertisement

అలాంటిది ఈ మెగా బ్రదర్స్ కలయికలో ఫుల్ లెంగ్త్ మూవీ వస్తే రికార్డులన్ని గల్లంతు అవడం ఖాయం. అయితే వీరిద్దరికి ఉన్న  కమిట్‌మెంట్స్ వల్ల ఇప్పట్లో ఆ అవకాశం లేనట్లే.  అయితే పవన్ కళ్యాణ్ శంకర్ దాదా జిందాబాద్‌ మూవీలోనే కాకుండా డాడీ మూవీలో కూడా కనిపించడమే కాకుండా ఫైట్ మాస్టర్ గా కూడా చేశారట. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో యాక్షన్ సినిమాలతో పాటు ఫ్యామిలీ డ్రామా సినిమాలలో  కూడా నటించి, అలరించారు.  అలాంటి సినిమాలలో డాడీ. ఒకటి. ఈ చిత్రంలో చిరంజీవి ఫ్యామిలీ మెన్‌గా నటించారు. సిమ్రాన్, ఆషిమా భల్లా హీరోయిన్లుగా నటించారు. నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్ బ్యానర్‌ పై నిర్మించగా, సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు.  2001 లో రిలీజ్ అయిన ఈ సినిమా 97 కేంద్రాలలో 50 రోజులు ఆడగా, 15 కేంద్రాలలో 100 డేస్ ఆడింది. ఈ మూవీని హిందీ మరియు తమిళంలో అనువదించి, విడుదల చేశారు.

హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీలో అల్లుఅర్జున్ చిరంజీవి శిష్యుడిగా నటించారు. చిరంజీవి ట్రూప్‌లో ఒక డ్యాన్సర్‌గా కనిపిస్తాడు. వీరిద్దరి మధ్య కొన్ని సీన్స్ ఉన్నాయి. బన్నీ మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ కూడా ఓ సీన్ లో కనిపించారు. ఇక ఈ మూవీ ఇంటర్వెల్ అనంతరం వచ్చే ఒక ఫైట్ సన్నివేశానికి పవన్ కళ్యాణ్ ఫైట్ మాస్టర్ గా వ్యవహరించారని సమాచారం.

చిరంజీవి కూతురు వద్ద ఉన్న డబ్బులు కొందరు లాక్కొని, పాపను పడేస్తారు. ఆ సమయంలో మ్యూజిక్ బిట్ తో పాటు వచ్చే ఫైట్ మూవీలో హైలెట్ అయ్యింది.  ఆ ఫైట్ సన్నివేశాన్ని ను కంపోజ్ చేసింది పవనే. బాగా గమనిస్తే గుండుతో ఒక వ్యక్తి కూర్చుంటాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు పవన్ కళ్యాణే. ఈ విషయాన్ని గమనించిన ఓ యూజర్ ఆ సీన్ ను నెట్టింట్లో షేర్ చేయగా వైరల్ అవుతోంది.

Also Read: రిలీజ్ అయిన 5 ఏళ్ల తర్వాత OTT లోకి వచ్చిన ఈ సినిమా చూసారా.? కామెడీ మాములుగా లేదుగా.?


End of Article

You may also like