రిలీజ్ అయిన 5 ఏళ్ల తర్వాత OTT లోకి వచ్చిన ఈ సినిమా చూసారా.? కామెడీ మాములుగా లేదుగా.?

రిలీజ్ అయిన 5 ఏళ్ల తర్వాత OTT లోకి వచ్చిన ఈ సినిమా చూసారా.? కామెడీ మాములుగా లేదుగా.?

by kavitha

Ads

ఈ మధ్యకాలంలో ఇతర భాషల చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో తెలుగులో కూడా వస్తున్నాయి.  కొన్ని థియేటర్ రన్ ముగుసిన తరువాత ఓటీటీలోకి వస్తుంటే, కొన్ని సినిమాలు నేరుగా డిజిటల్‌ ఫ్లాట్ ఫామ్స్ లో రిలీజ్ అవుతున్నాయి. ఎక్కువగా తమిళ, మలయాళ సినిమాలు తెలుగులో కూడా వచ్చేస్తున్నాయి.

Video Advertisement

ఆ మధ్యన స్ట్రీమింగ్‌కు వచ్చిన తమిళ మూవీ పోర్‌ తోళిల్‌ ఎలాంటి సంచలనం సృష్టించిందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా మరో కోలీవుడ్‌ సూపర్ హిట్ మూవీ తెలుగులో స్ట్రీమింగ్‌ కు వచ్చింది. అది కూడా రిలీజ్ అయిన ఐదేళ్ళ తరువాత తెలుగులో వచ్చింది. ఆ మూవీ ఏమిటో? ఎక్కడ చూడొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం..

తమిళ స్టార్ కమెడియన్ సంతానం ‘వల్లవనుక్కు పుల్లుమ్ ఆయుధం’ మూవీతో హీరోగా మారి, విజయం సాధించారు. ఆ తరువాత వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం సంతానం చేతిలో 3 సినిమాలు చిత్రాలు ఉన్నాయి.  రీసెంట్ గా సంతానం హీరోగా నటించిన వ‌డ‌క్కుప‌ట్టి రామ‌స్వామి మూవీ సూపర్‌ హిట్ గా నిలిచింది. ఆయన హీరోగా నటిస్తున్న ఇంగ నాన్ తాన్ కింగ్(ఇక్కడ నేనే కింగ్) మూవీ త్వరలో రిలీజ్ కానుంది. సంతానం ఫుల్ కమర్షియల్ సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తున్నారు.
కమెడియన్ సంతానంను హీరోగా నిల‌బెట్టిన చిత్రాలలో ఏ1 మూవీ ఒక‌టి. కోలీవుడ్ లో విడుదల అయిన ఐదేళ్ల త‌ర్వాత ఈ సినిమా  తెలుగులో అందుబాటులోకి వ‌చ్చింది. తెలుగు వెర్షన్ నేరుగా ఓటీటీలో విడుదలైంది. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏ1 మూవీ తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తెలుగు వెర్షన్ రెంట‌ల్ పద్ధతిలో అందుబాటులోకి తెచ్చారు.
సంతానం కామెడీ సినిమా అమెజాన్ ప్రైమ్ స‌బ్‌స్క్రిప్ష‌న్‌ తో పాటుగా రూ. 79 చెల్లించాల్సి ఉంటుంది. రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెర‌కెక్కిన ఈ సినిమాకి జాన్స‌న్ కే ద‌ర్శ‌కత్వం వహించాడు. అంచ‌నాలు లేకుండా విడుదల అయిన సినిమా మంచి వ‌సూళ్ళు సాధించి,  స్టార్ హీరోల చిత్రాలతో పోటీగా విడుదల అయ్యి, బాక్సాఫీస్ విజేతగా నిలిచింది.

Also Read: PAWAN KALYAN ASSETS: పవన్ కళ్యాణ్ కి ఉన్న ఆస్తులు ఎంత..? అప్పులే ఎక్కువ..?


End of Article

You may also like