OTT లోకి “తాప్సీ” థ్రిల్లర్ మిస్టరీ మూవీ.. గ్లామర్ డోస్ పెంచేసిన హీరోయిన్! 2021 లో రికార్డు సృష్టించిన.?

OTT లోకి “తాప్సీ” థ్రిల్లర్ మిస్టరీ మూవీ.. గ్లామర్ డోస్ పెంచేసిన హీరోయిన్! 2021 లో రికార్డు సృష్టించిన.?

by Harika

Ads

2010 లో ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగులో తర్వాత తమిళం, మలయాళం లో కూడా మూవీస్ చేశారు. 2013లో బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి మంచి సక్సెస్ ని అందుకున్నారు. ఆమె సినిమా అంటే వసూళ్లు మినిమం గ్యారంటీ అని నిర్మాతలు ఫిక్స్ అయిపోయారు. అందుకు తగ్గట్టుగానే ఆమె కూడా మంచి సక్సెస్ లు ఇస్తూ వస్తుంది. బేబీ, పింక్, రన్నింగ్ షాది, నామ్ షబానా, దిల్ జుంగ్లి,సూర్య, ముల్క్, తప్పడ్ వంటి సినిమాల తో పాటు పింక్ సినిమా ఆమెకి హిందీలో మంచి పాపులారిటీని తీసుకువచ్చాయి.

Video Advertisement

taapsee new movie on ott

లేడీ ఓరియంటెడ్ సినిమాలకు బాలీవుడ్ లో ఆమె కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది. తాప్సీ పన్ను లేటెస్ట్ మూవీ డంకి గత డిసెంబర్లో రిలీజ్ అయింది. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమా నెట్ఫ్లిక్స్  లో స్ట్రీమింగ్ అవుతుంది.

తాజాగా ఈమె మరొక కొత్త క్రైమ్ మిస్టరీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. అదే ఫిర్ ఆయి హసీన్ దిల్ రుబా. జయప్రద్ దేశాయ్ ఈ సినిమాకి దర్శకుడు. 12 th ఫెయిల్ చిత్రంతో మంచి సక్సెస్ ని అందుకున్న విక్రాంత్ మాస్సే ఈ చిత్రంలో నటించింది. 2021 లో థ్రిల్లింగ్ మ-ర్డర్ మిస్టరీగా వచ్చి నెట్ఫ్లిక్స్ లో రికార్డు వ్యూస్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న హసీన్ దిల్ రుబా సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా వస్తుంది.

taapsee new movie on ott

ఈ సినిమాలో తాప్సీ ని ఫుల్ రొమాంటిక్ మోడ్లో గ్లామర్ గా చూపించారు. ఆమె ముద్దు సన్నివేశాలతో సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా ఆకట్టుకుంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలై ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. మ-ర్డర్ మిస్టరీని లైట్ గా చూపించారు.త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.


End of Article

You may also like