ఈ విషయంలో అంబానీ కన్నా మన చిరంజీవి చాలా గ్రేట్… డబ్బు కన్నా విలువైనవి చాలా ఉన్నాయి! ఏం జరిగిందంటే.?

ఈ విషయంలో అంబానీ కన్నా మన చిరంజీవి చాలా గ్రేట్… డబ్బు కన్నా విలువైనవి చాలా ఉన్నాయి! ఏం జరిగిందంటే.?

by Harika

Ads

గత కొద్ది రోజులుగా దేశం మొత్తం అంబానీ ఇంట ఇంట జరిగే పెళ్లి గురించిన చర్చ జరుగుతుంది. జామ్ నగర్ లో జరిగిన అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ వేడుకలలో జరిగిన ఏర్పాట్లు, వచ్చిన అతిథులు, వడ్డించిన భోజనాలు, జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ నభూతో న భవిష్యత్ అన్న రేంజ్ లో జరిగాయి.

Video Advertisement

ఈ వేడుకలలో బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ అందరూ డాన్స్ చేసి అందర్నీ అలరించారు. అయితే ఈ స్టార్స్ అందరూ అంబానీ మీద అభిమానంతో డాన్స్లు చెయ్యలేదని, కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకొని డాన్సులు చెసారని ఇప్పుడు ప్రచారం జరుగుతుంది.అయితే అక్కడ బాలీవుడ్ స్టార్స్ అందరూ డబ్బు కోసమే కానీ అంబానీ మీద అభిమానంతో కాదన్నమాట అని నెటిజన్స్ ముక్కున వేలేసుకుంటున్నారు.

why only ram charan is invited to anant ambani pre wedding festivities

ఈ విషయంలో మన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చాలా బెటర్ అంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే మెగాస్టార్ చిరంజీవి తన మొదటి కూతురు సుష్మిత పెళ్లి ఎంత అంగరంగ వైభవంగా చేసాడో అందరికీ తెలిసిందే. ఈ వేడుక లో టాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు చాలామంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. అయితే ఈ వేడుకలలో కూడా చాలామంది సినీ తారలు డాన్సులు వేశారు. అయితే పారితోషకం తీసుకొని కాదు.

కేవలం చిరంజీవి మీద అభిమానం, అలాగే కోస్టార్ లందరూ కలిసిన ఉత్సాహంలో మాత్రమే అలా చేసారు. చిరంజీవి మీద తమకి ఉన్న అభిమానాన్ని ఆ విధంగా చాటుకున్నారు టాలీవుడ్ స్టార్స్. ప్రతి విషయాన్ని డబ్బుతో ముడి పెట్టడం లేం అనటానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ. చిరంజీవి కూడా అంతే పెద్ద తరహాగా ఇండస్ట్రీలో చిన్న పెద్ద అని చూడకుండా పిలిచిన ప్రతి పెళ్ళికి వెళ్లి ఆ నూతన జంటని ఆశీర్వదిస్తారు. అందుకే దట్ ఇస్ మెగాస్టార్ అని గర్వంగా చెప్పుకుంటారు మనవాళ్లు.

watch video:

ALSO READ: అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ మధ్య ఎంత వయసు తేడా ఉందో తెలుసా.?


End of Article

You may also like