ANANT AMBANI – RADHIKA MERCHANT: అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ మధ్య ఎంత వయసు తేడా ఉందో తెలుసా.? ఎవరు పెద్ద అంటే.?

ANANT AMBANI – RADHIKA MERCHANT: అనంత్ అంబానీ – రాధికా మర్చంట్ మధ్య ఎంత వయసు తేడా ఉందో తెలుసా.? ఎవరు పెద్ద అంటే.?

by Harika

Ads

భారతదేశపు అత్యంత సంపన్న వ్యాపార దిగ్గజం, ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల వివాహ ప్రీ వెడ్డింగ్ వేడుకలు మార్చి ఒకటి నుంచి మూడవ తేదీ వరకు గుజరాత్ లోని జాంనగర్ లో అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్ లో బిల్ గేట్స్, మార్క్ జుగర్ బర్గ్ తో పాటు బాలీవుడ్ ప్రముఖులు చాలామంది ఈ పెళ్ళికి హాజరు అయ్యారు. షారుఖ్, సల్మాన్, అమిర్ ఖాన్లతో కలిసి రామ్ చరణ్ స్టెప్పులు వేశారు.

Video Advertisement

why only ram charan is invited to anant ambani pre wedding festivities

పెళ్లి కోసం ముఖేష్ అంబానీ 1000 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నట్లు సమాచారం. ఇది దేశంలోనే అత్యంత ఖరీదైన వివాహం. ఖర్చులో ఎక్కువ భాగం అలంకరణలు, ప్రత్యక్ష ప్రదర్శనల కోసం ఖర్చు చేస్తున్నారు. మూడు రోజులకు భోజనాలు ఖర్చు 200 కోట్ల పైనే అని తెలిసింది. అతిథులకు ఏర్పాట్లతో పాటు వేడుక కోసం ప్రత్యేకంగా సెట్టింగులు వేయించి మరీ ఈ వేడుకను నిర్వహించారు. అన్నదానంతో మొదలైన వేడుకలకు హస్తాక్షర్ తో ముగింపు పలికారు.

gifts to ambani daughter in law

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ లకు గత ఏడాది ఎంగేజ్మెంట్ జరిగింది. మార్చి 1నుండి 3 మధ్యన ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిగాయి. జులైలో పెళ్లి జరగనుంది. అయితే అనంత్ అంబానీకి, రాధిక మర్చంట్ కి వయసు తేడా ఉంది. రాధిక అనంత్ కంటే పెద్దవారు. అనంత్ అంబానీ ఏప్రిల్ 10వ తేదీ 1995 లో పుట్టారు. రాధిక మర్చంట్ డిసెంబర్ 18వ తేదీ 1994 లో పుట్టారు. వీరిద్దరికి 5 నెలల వయసు తేడా ఉంది. ఎంతో మంది సెలబ్రిటీలు వయసులో తమకంటే పెద్ద అయిన ఆడవారిని పెళ్లి చేసుకున్నారు. కొంత మంది సంవత్సరాలు తేడా ఉన్న వారిని చేసుకుంటే, విరాట్ కోహ్లీ వంటి వారు ఇలాగే నెలలు తేడా ఉన్న వారిని పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ కూడా ఈ జాబితాలోకి చేరబోతున్నారు.


End of Article

You may also like