Ads
సాధారణంగా ఎవరైనా సినిమా ఇండస్ట్రీకి వచ్చాక, కొంత మందితో కలిసి పని చేయాలి అని అనుకుంటారు. ముఖ్యంగా నటులు అయితే, కొంత మంది నటులతో కలిసి పని చేయాలి అని, అలా చేస్తే వారు కెరీర్ లో ఒక మెట్టు ఎక్కినట్టే అని భావిస్తారు. అలా చాలా మంది నటులు ఇండస్ట్రీలో ఉన్నారు. హీరోయిన్స్ ఎంతో మంది కొంత మంది హీరోలతో కలిసి పని చేయాలి అని అనుకుంటారు. కొంత మంది ఆ కల నెరవేర్చుకున్నా కూడా, మరి కొంత మందికి మాత్రం కలలు కలలుగానే ఉండిపోతాయి. కానీ కొంత మంది మాత్రం, ఆ హీరోతో కానీ, ఆ యాక్టర్ తో కానీ ఒక్క సీన్ చేసినా కూడా చాలు అని అనుకుంటారు.
Video Advertisement
అది చాలా అదృష్టంగా భావిస్తారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టి, తర్వాత సినిమాల్లో నటించి, ఇప్పుడు సీరియల్స్ లో కూడా నటిస్తున్న నటి యమున. సినిమాల ద్వారా యమున ఎంత పాపులర్ అయ్యారో, సీరియల్ ద్వారా కూడా యమున అంతే పాపులర్ అయ్యారు. యమున ఎన్నో మంచి చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా ఎన్నో కంటెంట్ ఓరియంటెడ్ సినిమాల్లో, పాత్రకి ప్రాముఖ్యత ఎక్కువగా ఉన్న సినిమాల్లో నటించారు. అయితే యమున ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, పెద్ద హీరోలతో సినిమా చేయాలి అని, చేయలేకపోయాను అని ఒక వెలితి ఉండేది అని అన్నారు.
అందులోని ముఖ్యంగా చిరంజీవితో సినిమా చేయాలి అని అనుకున్నాను అని చెప్పారు. చిరంజీవితో యమున హీరోయిన్ గా నటించకపోయినా కూడా ఒక సినిమాలో చిరంజీవితో కలిసి యమున నటించారు. ఆ సినిమా శ్రీ మంజునాథ. రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యమున ఒక పాత్రలో నటించారు. గంగాదేవి పాత్రలో యమున నటించారు. చిరంజీవి ఆకాశమే ఆకారమై అనే ఒక పాటలో డాన్స్ చేస్తూ ఉన్నప్పుడు, యమున కూడా డాన్స్ చేస్తారు.
అలా చిరంజీవితో కలిసి డాన్స్ చేయడం అనేది అదృష్టంగా భావిస్తున్నట్టు ఏమైనా చెప్పారు. షాట్ అయిపోయాక, “నేను మీతో కలిసి డాన్స్ చేశాను సర్” అని యమున ఆనందపడ్డారట. రాఘవేంద్రరావు గారు వచ్చి, చిరంజీవి యమున, పెయిర్ బాగున్నారు అని, వీళ్ళు ఇంత బాగుంటారు అని తెలిస్తే, యమునకి ఇంత బాగా క్లాసికల్ డాన్స్ వచ్చు అని తెలిస్తే ముందే సినిమా చేసేవారు అని అన్నారట. ఇది చాలా పెద్ద కాంప్లిమెంట్ గా భావిస్తాను అని యమున చెప్పారు. అలా చిరంజీవి, యమున ఈ సినిమాలో కలిసి నటించారు. ఈ విషయానికి సంబంధించిన జ్ఞాపకాలని యమున ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
watch video :
ALSO READ : “గుప్పెడంత మనసు” సీరియల్ యాక్టర్ ని “హనుమాన్” లో గమనించారా?
End of Article