“గుప్పెడంత మనసు” సీరియల్ యాక్టర్ ని “హనుమాన్” లో గమనించారా?

“గుప్పెడంత మనసు” సీరియల్ యాక్టర్ ని “హనుమాన్” లో గమనించారా?

by Mohana Priya

Ads

సీరియల్స్ లో నటించే ఎంతో మంది నటీనటులు తర్వాత సినిమాల్లోకి వెళ్తూ ఉంటారు. కొంత మంది సీరియల్స్ లో నటిస్తూనే, సినిమాల్లో కూడా నటిస్తున్నారు. సీరియల్స్ లో కెరీర్ మొదలు పెట్టి, తర్వాత సినిమాల్లో హీరో, హీరోయిన్లుగా ఎదిగిన వారు కూడా ఉన్నారు. అలా ఇటీవల సీరియల్ లో చాలా పాపులర్ అయిన ఒక వ్యక్తి పాన్-ఇండియన్ సినిమాలో కనిపించారు. గుప్పెడంత మనసు సీరియల్ ప్రస్తుతం టాప్ రేటింగ్స్ తో దూసుకుపోతోంది. హీరో లేకుండా ప్రస్తుతం సీరియల్ నడుస్తూ ఉండడంతో కామెంట్స్ కూడా ఎక్కువగానే వస్తున్నాయి.

Video Advertisement

guppedantha manasu serial actor in hanuman

కానీ ఏదేమైనా సరే సీరియల్ రేటింగ్స్ మాత్రం తగ్గట్లేదు. ఒకపక్క, “హీరో లేడు” అని బాధపడుతూనే, మరొక పక్క, “అసలు స్టోరీ ఎలా నడిపిస్తారు?” అనే ఆసక్తితో సీరియల్ చూస్తున్నారు. ఈ సీరియల్ లో నటించిన నటీనటులందరికీ కూడా గుర్తింపు వచ్చింది. వారిని తమ ఇంట్లో వారిగా తెలుగు ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ సీరియల్ లో మను అనే పాత్రలో నటిస్తున్న నటుడు ఇటీవల ఒక సూపర్ హిట్ సినిమాలో నటించారు. మను పాత్ర పోషిస్తున్న నటుడి పేరు రవి శంకర్ రాథోడ్.

guppedantha manasu serial actor in hanuman

గతంలో నాలుగు స్తంభాలాట, గృహలక్ష్మి సీరియల్స్ లో నటించారు. ఇప్పుడు గుప్పెడంత మనసు సీరియల్ లో మను పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం మను పాత్రలో రవి శంకర్ చాలా మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నారు.  అయితే రవి శంకర్, ఇటీవల విడుదల అయ్యి సూపర్ హిట్ అయిన హనుమాన్ సినిమాలో, వరలక్ష్మీ శరత్ కుమార్ ని పెళ్లి చేసుకునే వ్యక్తిగా కనిపించారు. రవి శంకర్ ఈ సినిమాలో కొన్ని సీన్స్ లో మాత్రమే కనిపిస్తారు. స్టార్టింగ్ లో కనిపిస్తారు.

guppedantha manasu serial actor in hanuman

ఆ తర్వాత మళ్లీ వరలక్ష్మీ శరత్ కుమార్ కోసం కోసం వస్తారు. పెళ్లి సీన్ లో కనిపిస్తారు. మొత్తంగా ఒక 3 సీన్స్ లో రవి శంకర్ కనిపించారు. కానీ గుప్పెడంత మనసు సీరియల్ తో చాలా పాపులారిటీ సంపాదించుకున్నారు కాబట్టి, సినిమా చూశాక కనిపించినది కొన్ని సీన్స్ అయినా కూడా రవి శంకర్ ని చాలా మంది గుర్తుపట్టారు. రవి శంకర్ సినిమాల్లో నటించడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా కొన్ని సినిమాల్లో నటించారు. ఇప్పుడు ఇంకా గుర్తింపు సంపాదించుకున్నారు.

ALSO READ : మిరపకాయ్ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.? ఇప్పుడు ఎక్కడుందంటారు?


End of Article

You may also like