Ads
సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన వాళ్ల పేరు వస్తే, ముందుగా వచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి. సపోర్టింగ్ పాత్రల్లో కెరీర్ మొదలు పెట్టి, తర్వాత హీరోగా ఎదిగి, ఇప్పుడు మెగాస్టార్ స్థాయికి చేరుకున్నారు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఈ క్రమంలో ఆయన ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా కూడా వాటన్నిటిని అధిగమించి ఈ స్థాయికి వచ్చారు. ఇప్పటికి కూడా యంగ్ హీరోలకి పోటీగా సినిమాలు చేస్తున్నారు. ప్రేక్షకులని అలరించడానికి తాపత్రయ పడుతూ ఉంటున్నారు. అప్పట్లో సినీ నేపథ్యం లేకుండా వచ్చిన వారు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అనేది చాలా పెద్ద విషయం.
Video Advertisement
చాలా కష్టపడాలి. చాలా టాలెంట్ కూడా ఉండాలి. ఇవన్నీ మాత్రమే కాకుండా, ఎంచుకునే స్క్రిప్ట్ కూడా బలంగా ఉండాలి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేసుకున్నారు చిరంజీవి. అప్పట్లోనే చిరంజీవి రికార్డ్ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకునేవారు. ఆపద్బాంధవుడు సినిమాకి చిరంజీవి 1.25 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకొని సంచలనం సృష్టించారు. ఆయన రేంజ్ అలా ఉంటుంది మరి. అటు నటనకి ఆస్కారం ఉన్న సినిమాలు చేస్తూనే, మరొక పక్క కమర్షియల్ సినిమాలు కూడా చేస్తూ తన మార్కెట్ ని పెంచుకున్నారు చిరంజీవి. అయితే, చిరంజీవి నటించిన ముఠామేస్త్రి సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది.
చిరంజీవి కెరీర్ లో మైలురాళ్లు అని కొన్ని సినిమాలు లిస్ట్ చేస్తే, అందులో ముఠామేస్త్రి సినిమా ఉంటుంది. ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. చాలా పెద్ద హిట్ అవ్వడం మాత్రమే కాకుండా, చిరంజీవిని మెగాస్టార్ గా మరొక మెట్టు ఎక్కించింది. ఇప్పటికి కూడా చాలా మంది ముఠామేస్త్రి అనగానే మెగాస్టార్ స్టెప్ గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇన్ని సంవత్సరాలు అయినా సరే ఆ సినిమా ఇంపాక్ట్ అలా ఉంది.
అయితే అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి ముఠామేస్త్రి టికెట్ ధర 800 రూపాయలు ఉంది. ఇది చూసి సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ఆశ్చర్యపోయారు. 1993లో 800 రూపాయలు టికెట్ ధర ఉండడం అంటే ఆశ్చర్యపోవాల్సిన విషయమే కదా. ఒక అభిమాని ముఠామేస్త్రి టికెట్ అప్పట్లో 800 రూపాయలకి కొన్నారు. ఈ విషయం మీద న్యూస్ పేపర్ లో వార్త కూడా వచ్చింది. దానికి సంబంధించిన కటింగ్ బయటికి రావడంతో మెగాస్టార్ రేంజ్ ఏంటి అనేది మరొకసారి నిరూపించబడింది.
ALSO READ : JANHVI KAPOOR: తిరుమలలో మోకాళ్ల పర్వతం దగ్గర “జాన్వీ కపూర్” ఏం చేశారో తెలుసా..? ఈ వీడియో చూశారా..?
End of Article