దిల్ రాజుకి- తేజస్వినికి మధ్య ఇన్ని సంవత్సరాల తేడా ఉందా..? వీరిద్దరికీ ఉన్న ఏజ్ గ్యాప్ కి ఎంతంటే..?

దిల్ రాజుకి- తేజస్వినికి మధ్య ఇన్ని సంవత్సరాల తేడా ఉందా..? వీరిద్దరికీ ఉన్న ఏజ్ గ్యాప్ కి ఎంతంటే..?

by Harika

Ads

డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ మొదలు పెట్టి, తర్వాత నిర్మాతగా మారి ఎన్నో హిట్ సినిమాలని తెలుగు సినిమా ఇండస్ట్రీకి అందించారు దిల్ రాజు గారు. దిల్ రాజు గారు నిర్మాతగా మారి 20 సంవత్సరాలు అయ్యింది. నితిన్ హీరోగా నటించిన దిల్ సినిమాతోనే దిల్ రాజు గారు నిర్మాతగా మారారు. ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. దాంతో మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్న ప్రొడ్యూసర్ అయ్యారు. ఆ తర్వాత ఆర్య, భద్ర, బొమ్మరిల్లు సినిమాలతో విజయాలు నమోదు చేసుకున్నారు. బొమ్మరిల్లు సినిమా అయితే ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

Video Advertisement

dil raju and wife tejaswini age gap

దిల్ రాజు తన బ్యానర్ ద్వారా ఎంతో మంది దర్శకులని కూడా పరిచయం చేశారు. ఆర్యతో సుకుమార్, భద్ర సినిమాతో బోయపాటి శ్రీను, బొమ్మరిల్లు సినిమాతో భాస్కర్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత మున్నా సినిమాతో కూడా వంశీ పైడిపల్లిని పరిచయం చేశారు. శ్రీకాంత్ అడ్డాల, వాసు వర్మ, వేణు శ్రీరామ్, జాను సినిమాతో తమిళ్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ ఇలా ఎంతో మందిని తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. దిల్ రాజు గారి అసలు పేరు వెంకటరమణారెడ్డి. నిజామాబాద్ జిల్లాలో ఉన్న నర్సింగ్ పల్లిలో దిల్ రాజు గారు పుట్టారు.

అక్కడే చదువుకొని తర్వాత సినిమాలు అంటే ఆసక్తి ఉండడంతో హైదరాబాద్ కి వచ్చారు. 1997 లో వచ్చిన పెళ్లి పందిరి సినిమాతో డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ మొదలుపెట్టారు. ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ స్థాపించి ఎన్నో సినిమాలని నిర్మించారు. దిల్ రాజు గారికి, అనిత గారితో పెళ్లి జరిగింది. గుండె సంబంధిత సమస్యల కారణంగా అనిత గారు 2017 లో ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఆ తర్వాత దిల్ రాజు గారు 2020 లో తేజస్వినిని పెళ్లి చేసుకున్నారు.

తేజస్విని తర్వాత జ్యోతిష్యం ప్రకారం తన పేరుని వైఘా రెడ్డిగా మార్చుకున్నారు. వారిద్దరికీ 2022 లో ఒక బాబు కూడా పుట్టారు. వీరిద్దరికీ మధ్య కొంత వయసు తేడా ఉంది. దిల్ రాజు గారి వయసు 53 సంవత్సరాలు. డిసెంబర్ 17వ తేదీ, 1970 లో దిల్ రాజు గారు పుట్టారు. తేజస్విని 1987 లో పుట్టారు. తేజస్విని వయసు ఇప్పుడు 34 సంవత్సరాలు. వీరిద్దరికీ 17 సంవత్సరాల వయసు తేడా ఉంది. తేజస్విని కూడా అప్పుడప్పుడు సినిమా ప్రమోషన్స్ సందర్భంగా టీవీలో కనిపిస్తూ ఉంటారు. ఇటీవల ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ లో భాగంగా ఒక టీవీ ఈవెంట్ కి వెళ్లారు.

ALSO READ : MANJUMMEL BOYS REVIEW : మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో కూడా హిట్ అయినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!


End of Article

You may also like