Ads
కొంత మంది నటులకి వారు నటించిన సినిమా పేర్లు కూడా వారి పేరులో ఒక భాగం అయిపోతాయి. చాలా మంది నటులు వారి సినిమా పేర్లతో కలిపి వారి పేర్లను పెట్టుకుంటారు. లేదా ప్రేక్షకులు వాళ్ళని అలాగే గుర్తుపడతారు. అలా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. ఒక వ్యక్తి కూడా తాను హీరోగా నటించిన సినిమాతోనే చాలా ఫేమస్ అయ్యారు. ఎంత ఫేమస్ అయ్యారంటే, ఆ సినిమా పేరుని తన పేరుతో యాడ్ చేసుకున్నారు. ఆ వ్యక్తి మహర్షి రాఘవ. మహర్షి అనే సినిమాతో ఎంత ఫేమస్ అయ్యారో అందరికీ తెలుసు. వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో చాలా పెద్ద హిట్ టాక్ తెచ్చుకుంది.
Video Advertisement
ఇళయరాజా అందించిన పాటలు ఇప్పటికి కూడా అందరికీ గుర్తుండిపోతాయి. కథపరంగా కానీ, నటనపరంగా కానీ, టెక్నికల్ విభాగాల పరంగా కానీ సినిమా బలంగా ఉంటుంది. అందుకే ప్రేక్షకులు ఆ సినిమాని అంత ఆదరించారు. ఆ సినిమాలో హీరోగా నటించారు రాఘవ. రాఘవ ఈ సినిమా తర్వాత మహర్షి రాఘవ పేరుతో ఫేమస్ అయ్యారు. దాదాపు 170 కి పైగా సినిమాల్లో నటించిన రాఘవ, పదవ తరగతి వరకు తెనాలిలో చదువుకున్నారు. ఎన్నో నాటకాలలో నటించారు. చిత్రం భళారే విచిత్రం, జంబలకడిపంబ, కోరుకున్న ప్రియుడు, శుభాకాంక్షలు, సూర్యవంశం, హలో డార్లింగ్ సినిమాలతో గుర్తింపు పొందారు.
రాఘవ ఎన్నో సీరియల్స్ లో కూడా నటించారు. అన్వేషిత, కొంత కాలం క్రితం ఈటీవీలో వచ్చిన అంతపురం సీరియల్ లో కూడా నటించారు. మహర్షి భార్య పేరు శిల్ప. శిల్ప నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్. ఎన్నో సినిమాలో ఎంతో మంది హీరోయిన్లకి శిల్ప డబ్బింగ్ ఇచ్చారు. అరుంధతి సినిమాలో అనుష్క పాత్రకి, క్షేత్రం సినిమాలో ప్రియమణి పాత్రకి కూడా శిల్ప డబ్బింగ్ ఇచ్చారు. వీరికి మౌనిక అనే అమ్మాయి, రుద్రాక్ష్ అనే అబ్బాయి కూడా ఉన్నారు. తన నటనకి రాఘవ ఎన్నో పురస్కారాలు కూడా అందుకున్నారు. ఎన్నో నంది అవార్డులు రాఘవ అందుకున్నారు. రాఘవ కొంత కాలం నుండి ఎక్కడ కనిపించట్లేదు.
కానీ ఇప్పుడు మళ్లీ బయటికి వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి మహర్షి రాఘవని సత్కరించారు. చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ మొదలు పెట్టినప్పటి నుండి, ఇప్పటి వరకు మహర్షి రాఘవ 100 సార్లు రక్తదానం చేశారు. 1998, అక్టోబర్ 2వ తేదీన ఈ బ్లడ్ బ్యాంక్ మొదలు పెట్టారు. వీరిలో మొదటిగా రక్తదానం చేసింది మురళీమోహన్ గారు. ఆ తర్వాత రక్తదానం చేసింది మహర్షి రాఘవ. అప్పటి నుండి ఇప్పటి వరకు మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ ఇప్పటికీ 100 సార్లు రక్తదానం ఇచ్చారు.
ఈ విషయం చిరంజీవి తెలుసుకున్నారు. మహర్షి రాఘవ చేసే 100 రక్తదానం తానే దగ్గర ఉండి చేయిస్తాను అని చిరంజీవి చెప్పినప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల కుదరలేదు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ శేఖర్, చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ సిఓఓ రమణ స్వామి నాయుడు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనూష ఆధ్వర్యంలో రాఘవ 100వ రక్తదానం చేశారు. అందుకే చిరంజీవి తన ఇంటికి పిలిపించుకొని మరి రాఘవని సన్మానించారు. రాఘవ భార్య శిల్ప కూడా చిరంజీవి ఇంటికి వెళ్లారు.
ALSO READ : కార్తీకదీపం-2 చైల్డ్ ఆర్టిస్ట్ ఎమోషనల్ జర్నీ..! తల్లి, తండ్రి చెవిటి, మూగ అవ్వడంతో..?
End of Article