Ads
డబ్బింగ్ సినిమా అయినా కూడా తెలుగు ప్రేక్షకులకి బాగా నచ్చిన సినిమాల్లో 7/G బృందావన్ కాలనీ సినిమా కూడా ఒకటి. రవికృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా నటించిన ఈ సినిమాకి సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు. యువన్ శంకర్ రాజా అందించిన పాటలకు అభిమానులు ఉన్నారు. ఇప్పుడు కూడా ఈ పాటలు చాలా మంది ప్లే లిస్ట్ లో ఉంటాయి. సినిమాలో డైలాగ్స్ కూడా చాలా మందికి బాగా తెలిసి ఉంటాయి. కమర్షియల్ సినిమాలు రాజ్యం ఏలుతున్న సమయంలో, ఒక లవ్ స్టోరీ లాగా ఈ సినిమా వచ్చి ఎవరు ఊహించని విధంగా హిట్ అయ్యింది. లవ్ స్టోరీ అంటే హీరో చాలా మంచివాడు అన్నట్టు చూపించలేదు.
Video Advertisement
హీరో అసలు ఏ పని తెలియని ఒక వ్యక్తి అన్నట్టు చూపించారు. అలాంటి సమయంలో హీరో పాత్రని ఇలా చూపించడం అనేది చాలా కొత్తగా అనిపించింది. ఈ సినిమాలో హీరో ప్రవర్తించే తీరు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అసలు ఆ సమయంలో హీరో అలా ఎందుకు చేస్తాడు అనేది ఎవరికీ అర్థం కాదు. అందుకు ఉదాహరణ ఈ సీన్. ఇందులో హీరోయిన్ లెమన్ స్పూన్ ఆడుతూ ఉంటుంది. అప్పటికి హీరోయిన్ అంటే హీరోకి ఇష్టం ఉంటుంది. అందుకే ఆమె కోసం హీరో చప్పట్లు కొడుతూ ఉంటాడు. అయితే ఇక్కడ హీరోయిన్ ఓడిపోతుంది. ఒక్క క్షణం అర్థం కానట్టు చూసిన హీరో, తర్వాత సంతోషపడతాడు.హీరోయిన్ ఓడిపోయాక కూడా హీరో ఎందుకు సంతోషపడతాడు అనే ప్రశ్న అందరిలో నెలకొంటుంది.
కానీ అక్కడ హీరోయిన్ చేసిన పని చూసి హీరో ప్రేమలో పడతాడు. హీరోయిన్ ఓడిపోతుంది. హీరో చెల్లెలు గెలుస్తుంది. హీరోయిన్ తను ఓడిపోయినందుకు కాస్త బాధపడుతుంది. కానీ వెంటనే హీరో చెల్లెలు గెలిచినందుకు ఆ అమ్మాయిని కౌగిలించుకుంటుంది. ఇంకొకరి గెలుపుని తన గెలుపుగా అనుకొని ఆనందపడుతుంది. ముందు హీరోయిన్ ఓడిపోయినందుకు హీరో బాధపడతాడు. కానీ తర్వాత హీరోయిన్ మంచితనాన్ని గుర్తించిన హీరో అమ్మాయి చాలా మంచిది అని ఆనందపడతాడు. అప్పుడే హీరోయిన్ తో ప్రేమలో కూడా పడతాడు. ఈ సీన్ చాలా తక్కువ సమయం ఉంటుంది. కానీ అంత తక్కువ సమయంలో ఇలాంటి మార్పు ఒకటి ప్రేక్షకులకు చూపించడం అనేది దర్శకుడు కథని ఎంత బాగా రాసుకున్నారు అనేది చూపిస్తుంది.
watch video :
End of Article