Ads
ఫెమినిజం. దీన్ని చాలా మంది ఏదో ఒక తప్పుడు పదంలాగా చూస్తారు. ఫెమినిస్ట్. వీళ్లను కూడా ఏదో తప్పు చేసినట్టు చూస్తారు. స్త్రీల కోసం, వారి హక్కుల కోసం పోరాడే వాళ్లని ఫెమినిస్ట్ అంటారు. ఈ కాలంలో ఇలాంటి వాళ్ళు చాలా మంది వస్తున్నారు. గతంలో స్త్రీలకి, పురుషులకి హక్కులు వేరేగా ఉండేవి. సమాజంలో పురుషుల అధికారం ఎక్కువగా ఉండేది. ఇప్పటికి కూడా ఉంటుంది. కానీ ఇప్పుడు ఆడవారికి చాలా వరకు తమ అభిప్రాయాలని తెలిపే స్వేచ్ఛ వచ్చింది. గతంలో ఇది కూడా ఉండేది కాదు. వాళ్లు ఏం చేయాలి అనే విషయాలని కూడా వాళ్ళ ఇంట్లో ఉండే మగవాళ్ళు నిర్ణయించే వాళ్ళు.
Video Advertisement
ఆడవాళ్లు మాట్లాడడం అనేది అప్పట్లో తప్పు విషయం. వాళ్లు అలా ఏ విషయం మీద అయినా మాట్లాడితే తప్పు చేసినట్టే. అందుకే అలాంటి వారికి మద్దతుగా నిలబడడానికి, వాళ్లు కూడా మనుషులే అని చెప్పడానికి గతంలో ఎంతో మంది సంఘ సంస్కర్తలు కృషి చేశారు. వాళ్లు కూడా స్త్రీవాదులు. అలాంటి వారినే స్త్రీవాదులు అని అంటారు. కానీ ఇప్పుడు దీని నిర్వచనం పూర్తిగా మారిపోయింది. అసలు ఫెమినిస్ట్ లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
#1 అసలైన ఫెమినిస్ట్, అంటే స్త్రీవాది, మగవారితో పాటు ఆడవారికి కూడా సమాన హక్కు ఉండాలి అని అనుకుంటారు. ఆడవాళ్లు మగవాళ్ళ మీద పెత్తనం చలాయించాలి అని అనుకోవడం స్త్రీవాదం కాదు.
#2 ఆడవాళ్లు ఎలాంటి తప్పు చేసినా కూడా వారికి మద్దతు ఇవ్వడం స్త్రీవాదం కాదు. ఆడవాళ్లు చేసే ప్రతి పని కరెక్ట్ అనడం కూడా స్త్రీవాదం కిందకి రాదు. ఎక్కడైనా ఆడవాళ్ళకి, మగవాళ్ళకి మధ్య ఒక విషయం జరిగితే, దాంట్లో మగవాళ్ళదే తప్పు అని అనడం స్త్రీవాది లక్షణం కాదు. ఒకవేళ ఆడవాళ్లు తప్పు చేస్తే, ఆ విషయం మీద మాట్లాడే ధైర్యం ఉన్నవాళ్లే స్త్రీవాదులు.
#3 ఫెమినిజం పేరుతో ఈ మధ్య ఎక్కువగా వచ్చే సిరీస్, సినిమాల్లో తప్పుడు సమాచారం ఇస్తున్నారు. ఫెమినిజంకి మద్దతు ఇచ్చే ఆడవాళ్లు, తమని తాము ఫెమినిస్ట్ అని చెప్పుకునే ఆడవాళ్లు, తాగడం, తిరగడం, ఒకరికంటే ఎక్కువ మందితో రిలేషన్ షిప్ లో ఉండడం అనే విషయాన్ని చూపించారు. ఇలాంటి పనులు చేయడం స్త్రీవాదం కాదు. తమకంటూ ఒక ప్రత్యేకమైన ఆలోచన విధానం ఉండడం, తమ ఆలోచనలకు గౌరవం ఇచ్చుకోవడం అనేది స్త్రీవాదం. అంతే కానీ ఫెమినిస్ట్ అనే వ్యక్తి అలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు.
#4 ఆడదానికి ఆడదే శత్రువు అని అంటారు. అంటే ఆడవారిలో కూడా అందరి ఆలోచన విధానం ఒకేలాగా ఉండదు. ఒకరికి నచ్చే విషయం మరొకరికి నచ్చకపోవచ్చు. అలాంటప్పుడు తమ అభిప్రాయాన్ని తమ పక్కన ఉన్న ఆడవాళ్ళ మీద రుద్దకుండా, లేదా వాళ్లు ఆచరిస్తున్న విధానాలని తప్పు అని అనకుండా గౌరవించడం స్త్రీవాదం కిందకి వస్తుంది. అసూయ, ఈర్ష వంటివి లేకుండా ఒకరికి ఒకరు మద్దతు ఇచ్చుకుంటూ, ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవడం కూడా స్త్రీవాదం కిందికే వస్తుంది.
#5 అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్యలో ఒక సన్నని గీత ఉంటుంది. ఆ విషయాన్ని అర్థం చేసుకొని తమ ఆత్మ గౌరవాన్ని కాపాడుకునే వాళ్లే స్త్రీవాదులు. ఆడవాళ్లు అందరూ కూడా కరెక్ట్ గా ఉంటారు అని చెప్పలేం. వారు కూడా మనుషులే. వారు కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో పక్కవారి మీదకి తప్పు తోసేయకుండా, పరిస్థితిని అర్థం చేసుకొని, తమ తప్పు ఉంటే క్షమాపణ చెప్పడం, లేదా పరిస్థితిని ఎలా సరిచేయాలని ఆలోచించడం కూడా స్త్రీవాదం కిందికి వస్తుంది.
అసలైన స్త్రీవాదులు ఇలా ఉంటారు. స్త్రీవాదానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క నిర్వచనం ఉంటుంది. కానీ మగవాళ్ళు తప్పు, ఆడవాళ్లు గొప్ప అని స్త్రీవాదులు ఎప్పుడూ అనుకోరు. మనుషులు గొప్ప అనే ఆలోచనతో వాళ్లు ఉంటారు.
ALSO READ : 7/G బృందావన్ కాలనీ సినిమాలో ఈ సీన్ గమనించారా..? హీరోయిన్ ఓడిపోయినా కూడా హీరో ఎందుకు ఆనందపడతాడంటే..?
End of Article