Ads
సాధారణంగా కవలలు అంటే చూడడానికి ఒకేలాగా ఉంటారు. ఒకే రకమైన దుస్తులు కూడా ధరిస్తారు. వాళ్ళిద్దరిని సాధారణంగా ఎవరైనా చూస్తే అప్పుడప్పుడు తడబడుతూ ఉంటారు. సినిమాల్లో మాత్రమే ఇలా జరుగుతుంది అనుకుంటే పొరపాటే. నిజ జీవితంలో కూడా కవలలు కనిపిస్తే వాళ్ళు చూడడానికి ఒకేలాగా ఉంటే వాళ్ల పేర్లు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వాళ్ళిద్దరి పేర్లు కూడా దాదాపు దగ్గరగానే ఉంటాయి. అందుకే అలా కన్ఫ్యూజ్ అవుతారు. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది. ప్రవర్తన పరంగా, ఆలోచన విధానం పరంగా ఇద్దరికీ తేడాలు ఉండే అవకాశాలు ఉంటాయి.అలాగే చదువులో కూడా ఇద్దరికీ భిన్న వ్యక్తిత్వాలు ఉండే అవకాశాలు ఉంటాయి.
Video Advertisement
అవకాశాలు ఉండడం కాదు. అలాగే ఉంటారు. కానీ ఇటీవల ఒక కవలలు చదువులో కూడా ఒకటే దారిలో దూసుకెళ్లారు. ఒకే మార్కులు సంపాదించారు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఇలాగే జరిగింది. ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఫలితాలు నిన్న విడుదల అయ్యాయి. ఎంతో మంది విద్యార్థులు మంచి మార్కులు సంపాదించుకున్నారు. అయితే, ఒక విషయం మాత్రం చర్చలకి దారితీస్తోంది. వివరాల్లోకి వెళితే, ప్రకాశం జిల్లాలో ఉన్న, కనిగిరి మండలానికి చెందిన కవలలు చూడటానికి ఒకేలాగా ఉండడం మాత్రమే కాకుండా, ఒకే మార్కులు కూడా సాధించారు. షేక్ షరీఫ్ బాషా, షేక్ అఖ్తర్ కనిగిరి మండలానికి చెందినవారు. వాళ్ళిద్దరికీ 2008 లో షేక్ అల్తాఫ్, షేక్ ఆసిఫ్ పుట్టారు.
అక్కడే కనిగిరిలో ఉన్న బిఆర్ ఆక్స్ఫర్డ్ హైస్కూల్ లో వీళ్ళిద్దరూ పదవ తరగతి చదువుతున్నారు. వీళ్ళిద్దరూ అక్కడ ఉత్తమ విద్యార్థులుగా గుర్తింపు పొందారు. ఎంతో పట్టుదలతో వీళ్ళు చదివే వాళ్ళు. ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో 600 మార్కులకు 574 మార్కులు వచ్చాయి. ఇద్దరికీ ఒకటే మార్కులు వచ్చాయి. చూడడానికి ఒకేలాగా ఉండడం మాత్రం కాకుండా, మార్కులు కూడా ఒకేలాగా తెచ్చుకున్నారు అంటూ అందరూ అభినందిస్తున్నారు. వీళ్ళిద్దరూ నిన్న ఫలితాలు విడుదల అయిన తర్వాత ఇంటర్వ్యూలు ఇచ్చారు. అందులో మాట్లాడుతూ, తమ తల్లిదండ్రులు, తమ టీచర్ల సహాయంతోనే ఇంత మంచి మార్కులు సాధించారు అని తెలిపారు. పాఠశాల ఉపాధ్యాయులు కూడా వీరిద్దరిని అభినందించారు.
ALSO READ : “సాయి పల్లవి”, “భానుప్రియ” తో పాటు… తమ “డాన్స్” తో గుర్తింపు సంపాదించుకున్న 14 మంది హీరోయిన్స్..!
End of Article