10 సంవత్సరాల ప్రేమ… 11 సంవత్సరాల పెళ్లి… ఇప్పుడు విడాకులు..! అసలు కారణం ఏంటి..?

10 సంవత్సరాల ప్రేమ… 11 సంవత్సరాల పెళ్లి… ఇప్పుడు విడాకులు..! అసలు కారణం ఏంటి..?

by Harika

Ads

మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్. తెలుగులో కూడా చాలా సుపరిచితులు. చాలా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు. తెలుగులో డార్లింగ్ సినిమాతో గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత ఇటీవల వచ్చిన ఆదికేశవ సినిమాకి కూడా సంగీతం అందించారు. జీవీ ప్రకాష్ కుమార్ ఏఆర్ రెహమాన్ కి బంధువు అవుతారు అనే సంగతి తెలిసిందే. ఈమధ్య జీవీ ప్రకాష్ హీరోగా కూడా నటిస్తున్నారు. గత కొద్ది సంవత్సరాల నుండి మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తూనే, హీరోగా కూడా చేస్తున్నారు. ఇటీవల జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన డియర్ అనే సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Video Advertisement

gv prakash kumar saindhavi separation

ఇదే పేరుతో ఈ సినిమాని తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేశారు. అయితే జీవీ ప్రకాష్ 2013 లో సింగర్ సైంధవిని పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరూ చిన్నప్పటినుండి ఒకరికి ఒకరు తెలుసు. స్కూల్ సమయం నుండి వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. దాదాపు పది సంవత్సరాలు వీళ్లు ప్రేమలో ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళ ఇళ్లల్లో చెప్పి వాళ్ళని ఒప్పించి ఆనందంగా పెళ్లి చేసుకున్నారు. తర్వాత చాలా ఇంటర్వ్యూలలో జీవీ ప్రకాష్ కుమార్ సైంధవి గురించి గొప్పగా చెప్పారు. వీళ్ళిద్దరికీ 2020 లో ఒక పాప పుట్టింది. అందరూ వీళ్లు చాలా ఆనందంగా ఉన్నారు అని అనుకున్నారు.

కానీ ఇవాళ సోషల్ మీడియా వేదికగా వాళ్ళిద్దరూ విడిపోతున్నట్టు ప్రకటించారు. అందుకు కారణాన్ని కూడా చెప్తూ, తమ మానసిక ప్రశాంతత కోసం వాళ్ళిద్దరూ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ విషయం మీద చర్చలు ఎక్కువగా జరుగుతున్నాయి. “మానసిక ప్రశాంతత లేనప్పుడు ముందే విడిపోవాలి కానీ పిల్లలు పుట్టాక విడిపోవడం ఏంటి?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సెలబ్రిటీలు విడిపోవడం అనేది కొత్త కాదు. కానీ వీళ్లు చిన్నప్పటినుండి ఒకరికి ఒకరు తెలుసు. 10 సంవత్సరాలు ప్రేమలో ఉన్నారు. ఒక మనిషిని అర్థం చేసుకోవడానికి ఇంతకంటే ఎక్కువ కాలం అవసరం లేదు.

సంవత్సరంలోనే మనిషి గురించి అంతా తెలిసిపోతుంది. ఇన్ని సంవత్సరాలు కలిసి జీవించాక ఇప్పుడు విడిపోవడం ఏంటి? అసలు విడిపోయేంత నిర్ణయం తీసుకోవడానికి ఏ కారణం ఉంది? అంటూ కామెంట్స్ వస్తున్నాయి. మరి కొంత మంది అయితే 2020 నుండి ఇద్దరికీ మధ్య మనస్పర్ధలు ఉన్నాయి అని అంటున్నారు. ఈ కారణంగానే ఒకరి గురించి ఒకరు బయట ఎక్కువగా చెప్పుకోవట్లేదు అని, అసలు వీళ్ళిద్దరూ విడిపోతారని ముందే అనుకున్నట్టు కొంత మంది కామెంట్స్ కూడా చేస్తున్నారు.


End of Article

You may also like