Ads
సినిమా అంటే పెద్ద కాన్సెప్ట్ ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని సార్లు మామూలు కాన్సెప్ట్ ఉన్న సినిమా కూడా ఆసక్తికరంగా రూపొందిస్తే ప్రేక్షకులు చూస్తారు. మలయాళం లో ఇలాంటి సినిమాలు చాలా వస్తూ ఉంటాయి. సినిమా కాన్సెప్ట్ చాలా మామూలుగా ఉంటుంది. సాధారణంగా చాలా మంది ఇళ్లల్లో జరిగే విషయాలు, లేదా మానసికంగా వాళ్ళు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అనేది సినిమాల్లో వివరంగా చూపించే ప్రయత్నం చేస్తారు. అందుకే మలయాళ సినిమాలు ఒరిజినాలిటీకి దగ్గరగా ఉంటాయి అని అంటూ ఉంటారు. అలాంటి ఒక మలయాళం సినిమా తెలుగులో కూడా విడుదల అయ్యి మంచి టాక్ సంపాదించుకుంది. ఆ సినిమా పేరు వరనే అవశ్యముంద్. అనూప్ సత్యన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.
Video Advertisement
దుల్కర్ సల్మాన్, సురేష్ గోపి, శోభన, కళ్యాణి ప్రియదర్శన్ ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా తెలుగులో పరిణయం పేరుతో విడుదల అయ్యింది. ఈ సినిమా ఆహాలో స్ట్రీమ్ అవుతోంది. ఇంక ఈ సినిమా కథ విషయానికి వస్తే, నీనా (శోభన) చెన్నైలో ఒక ఫ్రెంచ్ ట్యూటర్ గా పనిచేస్తూ ఉంటుంది. ఆమె ఒక క్లాసికల్ డాన్సర్ కూడా. ఆమె కూతురు నికిత (కళ్యాణి ప్రియదర్శన్). నీనా ప్రేమ పెళ్లి చేసుకొని భర్తతో విడిపోతుంది. తల్లిలాగా తను కాకూడదు అని నికిత ప్రేమ పెళ్లికి దూరంగా ఉంటుంది. మ్యాట్రిమోనియల్ సైట్స్ లో అబ్బాయిలని చూసుకొని, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటుంది. అలా ఒకసారి అభి అనే అబ్బాయిని కలుస్తుంది. అతనితో ప్రేమలో కూడా పడుతుంది.
ఇదే అపార్ట్మెంట్ లోకి రిటైర్డ్ మేజర్ ఉన్నికృష్ణన్ (సురేష్ గోపి) దిగుతాడు. ఉన్నికృష్ణన్ కి కోపం ఎక్కువగా వచ్చే సమస్య ఉంటుంది. ఉన్నికృష్ణన్, నీనా ఒకసారి అనుకోకుండా కలుస్తారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ప్రేమలో పడతారు. అక్కడే ఉండే ఫ్లాట్‌మేట్స్ ఈ విషయాన్ని మాట్లాడుకోవడం నికితకి తెలుస్తుంది. నికిత ఈ విషయాన్ని తన తల్లిని అడిగితే ఆమె ఏమీ మాట్లాడదు. ఈ విషయాన్ని నికిత అభితో చెప్తే అభి మాట్లాడటం మానేస్తాడు. మరొక పక్క, అదే అపార్ట్మెంట్ లో బిబీష్ (దుల్కర్ సల్మాన్) దిగుతాడు. బిబీష్ కి ఒక అమ్మాయి తో బ్రేకప్ అవుతుంది. నికితకి అతనితో పరిచయం అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. సినిమా ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా. డబ్బింగ్ కూడా చాలా క్వాలిటీగా అనిపిస్తుంది.
ఒక వయసు వచ్చిన తర్వాత ప్రేమించడం అనేది చాలా సినిమాల్లో సరిగ్గా చూపించరు. కానీ ఈ సినిమాలో ఆ పాయింట్ చాలా బాగా చూపించారు. పెద్ద వయసు వచ్చాక ప్రేమించడం అనేది తప్పు కాదు అని ఈ సినిమాలో చెప్పడానికి ప్రయత్నించారు. శోభన మాట్లాడే డైలాగ్స్ చాలా ఎమోషనల్ గా అనిపిస్తాయి. 2020 లో విడుదలైన ఈ సినిమా మంచి టాక్ సంపాదించుకుంది. అందుకే ఈ సినిమాని తెలుగులోకి కూడా డబ్ చేసి విడుదల చేశారు. తెలుగులో కూడా ఈ సినిమా చూసిన వాళ్ళందరూ ఇలాంటి విషయాన్ని సినిమాలో చూపించడం అనేది బాగుంది అంటూ కామెంట్ చేశారు.
End of Article