Ads
సినిమా ఉండేది మూడు గంటలే. కానీ ఆ సినిమా చూపించే ప్రభావం ఎంతో కాలం ఉంటుంది. కొన్ని సినిమాలు అలా చూసి, అలా మర్చిపోయేలాగా ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు అలా కాదు. ఒకసారి చూస్తే జీవితాంతం గుర్తుండిపోతాయి. ఆ సినిమా మైండ్ లో నుండి పోవడానికి చాలా సమయం పడుతుంది. అలాంటి సినిమాలు చాలా వచ్చాయి. ఇంకా వస్తూనే ఉంటాయి. సినిమా చూశాక ఎన్నో సంవత్సరాలు ఆ సినిమా ప్రేక్షకులకి గుర్తు ఉంటే ఆ సినిమాని క్లాసిక్ అని అంటారు. అలాంటి ఒక సినిమా గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. కమల్ హాసన్. విలక్షణ నటుడు. ఆయన పోషించని పాత్ర లేదు.
Video Advertisement
ప్రతి పాత్రకి అదొక రకమైన గొప్పతనాన్ని ఆయన తీసుకొస్తారు. చాలా మంది నటులు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుంటారు. ఒక మనిషికి తన వృత్తిపట్ల ఎంత గౌరవం ఉంటుంది అనేది కమల్ హాసన్ ని చూస్తే తెలుస్తుంది. సినిమా కోసం ఆయన పడే తపనని చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రతి సినిమాకి, ప్రతి పాత్రకి తనని తాను మార్చుకుంటారు. ఇలా చాలా తక్కువ మంది చేస్తారు. 40 ఏళ్ల వ్యక్తిగా నటించిన కమల్ హాసన్, 80 ఏళ్ల వ్యక్తిగా కూడా నటిస్తారు. కమల్ హాసన్ నటించిన సినిమా అన్బే శివం. ఈ సినిమాని తెలుగులో సత్యమే శివం పేరుతో డబ్ చేసి విడుదల చేశారు. కమల్ హాసన్ సినిమాల్లోనే ఒక మంచి సినిమాగా ఇది నిలుస్తుంది.
ఇప్పటికి కూడా ఈ సినిమాని చాలా మంది క్లాసిక్ సినిమా అని అంటారు. ఇండియన్ సినిమాల్లోనే వచ్చిన బెస్ట్ సినిమాల్లో ఒకటిగా ఈ సినిమాని పరిగణిస్తారు. ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటు మాధవన్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషించారు. హీరోయిన్ గా కిరణ్ రాథోడ్ నటించారు. సుందర్ సి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఇప్పుడు సుందర్ సి అంటే మనకి ఇటీవల వచ్చిన కళావతి సినిమా, దాని సిరీస్ సినిమాలు గుర్తొస్తాయి. కానీ సుందర్ సి ఇలాంటి సినిమాని కూడా తెరకెక్కించారు. చాలా మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఇది. సినిమాలు జీవితానికి అర్థం తెలుపుతాయి అనే దానికి ఒక నిదర్శనం ఈ సినిమా. విద్యాసాగర్ గారు ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి కథ కమల్ హాసన్ అందించారు.
ఎంతో మంది దర్శకులకి కమల్ హాసన్ ఈ సినిమా కథని వినిపించారు. కానీ తర్వాత సుందర్ సి తో ఈ సినిమా చేశారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. సినిమా కలెక్షన్ల పరంగా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. కానీ విమర్శకులు మాత్రం ఈ సినిమాని చాలా అభినందించారు. ఇప్పటికి కూడా కమల్ హాసన్ కెరీర్ లో మాత్రమే కాకుండా, భారతీయ సినిమా చరిత్రలోనే ఈ సినిమాని గొప్ప సినిమాల్లో ఒకటిగా అనుకుంటారు అంటే, నిజంగానే ఈ సినిమా ఎంత గొప్ప సినిమా అనేది మనమే అర్థం చేసుకోవాలి. చాలా మంది ఈ సినిమా చూశాక నటనని, సినిమాలో ప్రతి విషయాన్ని చూపించిన విధానాన్ని పొగిడారు.
End of Article