పెళ్లి చూపులకి వచ్చినప్పుడే ఇలా చెప్పేసాడు… కానీ మా ఇంట్లో వాళ్ళు వినట్లేదు..! నేనేం చేయాలి..?

పెళ్లి చూపులకి వచ్చినప్పుడే ఇలా చెప్పేసాడు… కానీ మా ఇంట్లో వాళ్ళు వినట్లేదు..! నేనేం చేయాలి..?

by Harika

Ads

అందరికీ అన్ని విషయాల మీద క్లారిటీ ఉండదు. కొంత మంది కొన్ని విషయాలు ఆలోచించడానికి కూడా ఎక్కువగా ఇష్టపడరు. ఆ విషయాల మీద ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగితే సమాధానం వారి దగ్గర ఉండదు. అందులో పెళ్లి కూడా ఒకటి. పెళ్లి గురించి నేను ఎక్కువగా ఆలోచించలేదు. నాకు కొన్నిటి మీద మాత్రమే స్పష్టత ఉంది. ఒకవేళ నేను ఎవరినైనా అబ్బాయిని కలిస్తే, ఆ అబ్బాయి నాకు నచ్చినట్టు మాట్లాడకపోతే అతను నచ్చలేదు అని ఇంట్లో వాళ్ళకి చెప్పేద్దాం అని అనుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత అసలు సమస్య వచ్చింది.

Video Advertisement

a man shares incident at pelli choopulu

ఇలా నేను చెప్పిన ప్రతిసారి మా వాళ్ళు నేను ఏదో చేయకూడని నేరం చేసినట్టు చూశారు. అన్నిటికీ అడ్జస్ట్ అవ్వాలి అనడం మొదలుపెట్టారు. దేనికి అడ్జస్ట్ అవ్వాలో నాకు కూడా అర్థం కాలేదు. ఏమైనా అంటే పెళ్లయిన తర్వాత అబ్బాయిని నీ ఇష్టం వచ్చినట్టు మార్చుకో అని అన్నారు. అలా ఒక మనిషిని మార్చుకోవడం కుదురుతుందా? ఇది ఆలోచించడం కూడా మంచిది కాదు కదా? ఇవే ఆలోచనలతో ఒక అబ్బాయిని కలవమంటే కలిశాను. అబ్బాయి వాళ్ళు మా ఇంటికి వచ్చారు. అతను నాతో ప్రైవేట్ గా మాట్లాడాలి అని చెప్పాడు. నాకు కూడా కాస్త మాట్లాడడానికి సౌకర్యంగా ఉంటుంది అని అనుకున్నాను.

అతను తన గురించి తాను చెప్పడం మొదలు పెట్టాడు. తన ఉద్యోగం గురించి చెప్పాడు. తర్వాత, తనకి అప్పుడప్పుడు తాగే అలవాటు ఉంది అని చెప్పాడు. వీటన్నిటి వల్ల నాకు ఏమైనా ప్రాబ్లం ఉందా అని అడిగాడు. నేను లేదు అని చెప్పాను. అప్పుడు అసలు విషయం చెప్పాడు. “ఇవన్నిటికంటే ముఖ్యమైన విషయం ఉంది. నాకు కోపం చాలా ఎక్కువ. చాలా సార్లు గొడవలకి వెళ్లాను. మా ఇంట్లో వాళ్ళు ఈ విషయం మీద ఎంత చెప్పినా కూడా నేను వినలేను. ఇది ఈగో అనుకున్నా నాకు పర్లేదు. చిన్న చిన్న విషయాలకి నాకు కోపం వస్తుంది. నేను కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తాను.”

“కానీ నా వల్ల కాదు. కోపం వస్తే అరుస్తాను. గొడవ చేస్తాను. నాకు ఎమోషన్స్ కూడా చాలా ఎక్కువ. చిన్న చిన్న వాటికి హర్ట్ అవుతాను. అది కూడా ముఖ్యంగా ఇంట్లో వాళ్ళు ఏదైనా చేస్తే చాలా ఎక్కువగా హర్ట్ అవుతాను. నేను బాధపడితే ఆ తర్వాత నన్ను ఓదార్చడం కూడా చాలా కష్టం అని మా వాళ్ళు అంటూ ఉంటారు. నాకు కాబోయే భార్య వేరే అబ్బాయిలతో స్నేహంగా మాట్లాడినా కూడా నేను తట్టుకోలేను. నా ఒక్కడితోనే క్లోజ్ గా మాట్లాడాలి. ఇంకొకళ్లతో మాట్లాడితే నాకు బాధగా అనిపిస్తుంది. ఇవన్నీ కూడా పెళ్లయిన తర్వాత మీరు మార్చుకోవాలి అని అనుకుంటే మాత్రం మీ టైం వేస్ట్”.

“ఇవన్నిటికీ అడ్జస్ట్ అవుతాను అంటేనే మీరు ఓకే చెప్పండి. అంతే కానీ పెళ్లయిన తర్వాత మార్చుకుంటాను అనే మైండ్ సెట్ తో నన్ను పెళ్లి చేసుకుంటే మాత్రం తర్వాత మీకే ఇబ్బంది” అని చెప్పాడు. నాకు నోట మాట రాలేదు. ఇదంతా మా ఇంట్లో వాళ్లకు చెప్పాను. వాళ్లు నా మాట ఎప్పుడు విన్నారు? “అలానే చెప్తారు కానీ తర్వాత వాళ్లే మారుతారు” అని అన్నారు.

ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నిజంగా పెళ్లి అయ్యాక ఒకళ్ళని మార్చుకోవడం అనే విషయాన్ని కంటే మూర్ఖత్వం ఇంకొకటి లేదు అని నాకు అనిపిస్తుంది. కానీ మా వాళ్ళు ఏమో అలా మార్చుకోవాలి అని అంటారు. చాలా అయోమయంగా అనిపించింది. కానీ నాకు మాత్రం అతను అంత క్లియర్ గా చెప్పిన తర్వాత ముందుకు వెళ్లాలి అనిపించలేదు. అక్కడే వదిలేయడం నయం ఏమో అనిపించింది.


End of Article

You may also like