Ads
సాధారణంగా పెళ్లిలో అందరికీ కొన్ని లక్షణాలు కావాలి అని ఉంటుంది. తమకి కాబోయే భాగస్వామి ఇలా ఉంటేనే పెళ్లికి సుముఖత చూపుతారు. ఒక్కొక్కరికి ఒక రకమైన లక్షణాలు ఉంటాయి. ఉద్యోగం అనేది పురుషలక్షణం అని గతంలో అనేవారు. కానీ ఇప్పుడు కాలంతో పాటు ఈ మాట మారిపోయింది. ఉద్యోగం అనేది మనిషి లక్షణం అని అంటున్నారు. ఏ మనిషి అయినా సరే తన కాళ్ల మీద తను నిలబడాలి అని అనుకోవాలి అని ఆలోచన విధానం అందరిలో వచ్చింది. ఆడవారు కూడా మగవారితో సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారు. వారితో సమానంగా సంపాదిస్తున్నారు. అంతే బాగా ఇంటిని చూసుకుంటున్నారు.
Video Advertisement
అయితే, ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో, మగవారికి ఉద్యోగం చేసే అమ్మాయి కావాలా? ఉద్యోగం చేయని అమ్మాయి కావాలా? అనే ప్రశ్న అడిగితే, అందుకు ఎక్కువ శాతం మంది ఉద్యోగం చేయని అమ్మాయి కావాలి అని కోరుకుంటున్నారు. అందుకు వారి కారణాలు వారికి ఉన్నాయి. ఈ సర్వే ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం కాదు. 2023 లోనే నిర్వహించారు. అంటే, చాలా వరకు ఇప్పటి జనరేషన్ అబ్బాయిలు కూడా ఇలాగే ఉన్నారు. గత సంవత్సరం నిర్వహించిన సర్వే ప్రకారం ఇంటి బాధ్యతలు నిర్వహించే మహిళలని మగవాళ్ళు కావాలి అని అనుకుంటారు.
సంపాదించకపోయినా కూడా భార్య ఇంట్లో ఉన్న పనులు చేస్తే చాలు అని అనుకునే మగవారు ఎక్కువగా ఉన్నారట. అన్ని చోట్ల ఇలా ఉంటారు అని చెప్పలేం కానీ, ఎక్కువ శాతం మంది మాత్రం ఇలా ఉన్నారు. కొంత మంది ఉద్యోగాలు చేసే భార్యలు కావాలి అని అనుకుంటున్నారు. కొంత మంది తమ భార్యలు ఉద్యోగాలు చేసినా, చేయకపోయినా ఏం కాదు అని అనుకుంటున్నారు. సాధారణంగా ఉద్యోగాలు చేసినప్పుడు వర్క్ వల్ల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మగవారు ఉద్యోగాలు చేస్తే వాళ్ళకి ఆ ఒత్తిడి ఉంటుంది. ఇప్పుడు ఆడవాళ్లు కూడా ఉద్యోగం చేస్తే వాళ్ళ కూడా ఒత్తిడి ఉంటే గొడవలు వస్తాయి అనే ఉద్దేశంతోనే మగవాళ్ళు ఉద్యోగం చేయని ఆడవాళ్ళని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారట.
కానీ మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో ఉండే వారు మాత్రం ఎక్కువగా ఉద్యోగాలు చేసే మహిళలు కావాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ ఇద్దరు కలిసి సంపాదించకపోతే బతకడం కష్టం. ఈ కారణంగానే ఉద్యోగం చేసే మహిళ అయితే ఆర్థికంగా కూడా సహాయంగా ఉంటారు అని అనుకుంటున్నారు. ఇదంతా కూడా తక్కువ శాతం మాత్రమే అనుకుంటున్నారు. ఎక్కువ శాతం పురుషులు మాత్రం ఇంట్లో ఉండే ఆడవారు కావాలి అని అనుకుంటున్నారు.
End of Article