Ads
నా ఫ్రెండ్ ఒకమ్మాయి కొత్తగా జాబ్లో జాయిన్ అయింది. కొత్త ప్లేస్ ఎలా ఉంది, జాబ్ ఎలా ఉందో కనుక్కుందాం అని మెసేజ్ చేసా. కుశల ప్రశ్నలయ్యాక అప్పుడు చెప్పింది. అంతా బాగానే ఉంది కానీ బాస్ తోనే కొంచెం ఇబ్బందిగా ఉంది అని. ఏమైంది అంటే? ఏం లేదు పదే పదే విసిగిస్తాడు , మెసెజెస్ చేస్తుంటాడు. కలుద్దామా అని అడుగుతుంటాడు. ఈ ప్రాబ్లం నుండి ఎలా బయటపడాలో అర్దం కావట్లేదు అని.నిజానికి ఇలాంటి సమస్య చాలామంది ఎదుర్కొంటుంటారు. దానికి పరిష్కారం ఏంటి?
Video Advertisement
అమ్మాయిలు ఉద్యోగంలో జాయిన్ కావాలంటే ఎన్నో వ్యయప్రయాసలకోర్చాలి. కేవలం మంచి చదువు,మార్కులుంటే సరిపోదు. ఉద్యోగానికి వెళ్లడానికి కుటుంబాన్ని ఒప్పించడం అనేది చాలా పెద్ద టాస్క్. అది కంప్లీట్ అయి ఉద్యోగం చేసుకునే టైంలో ఇలాంటి ఇబ్బందులొస్తే , చాలా మంది అమ్మాయిలు ఇంట్లో చెప్పడానికి ఇబ్బంది పడతారు . ఎందుకో తెలుసా ఉద్యోగం మాన్పించేసి ఇంట్లోనే ఉండమంటారేమో అని భయం . అది వాస్తవం కూడా . ఎవరైనా అమ్మాయి నేను ఫలానా వాడు నన్ను ఇట్లా ఏడ్పిస్తున్నాడు అంటే, నువ్ వాన్ని ఏమనలేదా? నువ్వ ఏమనకుండా వాడు నీ జోలికెందుకొస్తాడు అంటూ టక్కున అనేస్తారు.
అంతెందుకు ఒక చిన్న ఉదాహరణ షేరింగ్ ఆటోలో వెళ్లేప్పుడు ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు . కానీ పక్కన కూర్చున్నవాళ్లు కావాలని తాకుతూ ఉంటే ఏ అమ్మాయికైనా తెలియకుండా ఉంటుందా? తాకకుండా కూర్చో అని సీరియస్ గా చెప్తే , ఏ అమ్మో ఇది శేర్ ఆటో మనుషులన్నాక తాకుతారు అని ఒకరు , నిన్నెవరూ తాకొద్దనుకుంటే ఒక ఆటో బుక్ చేసుకుని వెళ్లు అని ఇంకొకరు ఇలా తలా ఒకరు ఒక్కో మాట అంటే ఇంక జన్మలో తనెప్పుడూ ఇలాంటి ఇబ్బంది ఎదురైనా చెప్పుకోవాలనుకోదు .
అమ్మాయిలు తమ సమస్యను చెప్పుకునే పరిస్థితి కల్పించండి. ఆ సమస్యలో నిజనిజాలేంటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. సమస్యని ఎలా పరిష్కరించొచ్చో ఆలోచించండి. అంతేకాని విషయం తెలియగానే ఎక్కడ పరువు పోతుందో అన్నట్టుగా , నిందలన్ని అమ్మాయిపైనే వేసి ఇంట్లో కూర్చోబెట్టకండి . మీకు తెలుసా? నూటికి తొంబై శాతం మంది అమ్మాయిలు తెలిసిన వాళ్ల చేతుల్లోనే అత్యాచారాలకు గురౌతున్నారనేది ఇటీవల ఒక సర్వేలో తేలింది. ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ఆడవారిపై ఇంకెన్ని రోజులు ఇలా? మీ సలహా కామెంట్స్ లో తెలుపండి.
End of Article