ఉదయ్ కిరణ్ గురించి సునీల్ బయటపెట్టిన విషయం ఇది..! తెలుస్తే కన్నీళ్లొస్తాయి.!

ఉదయ్ కిరణ్ గురించి సునీల్ బయటపెట్టిన విషయం ఇది..! తెలుస్తే కన్నీళ్లొస్తాయి.!

by Anudeep

Ads

ఉదయ్ కిరణ్ చాలా చిన్న ఏజ్ లోనే స్టార్ డమ్ చూసిన అతి కొద్దిమంది హీరోల్లో ఒకరు . వరుస హిట్లు , స్టార్ హీరోగా క్రేజ్, అభిమానుల ఫాలోయింగ్ , ఛాక్లెట్ బాయ్ గా ఇప్పటికి అమ్మాయిల మనసుల్లో ఉదయ్ కిరణ్ స్థానం పదిలం .అమ్మాయిలతో సమానంగా అబ్బాయిలు కూడా ఉదయ్ కిరణ్ ని ఇష్టపడేవాళ్లు . అర్దాంతరంగా ఆగిపోయిన కెరీర్ తో తన జీవితానికి తనే చెక్ పెట్టుకుని బలవన్మరం పొందాడు. ఉదయ్ కిరణ్ తో ఎన్నో సినిమాల్లో నటించిన సునీల్ ఉదయ్ ని గుర్తు చేసుకుంటూ ఒక ఆసక్తికరమైన విషయం పంచుకున్నారు.చిత్రం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఉదయ్ కిరణ్ , తర్వాత తేజ దర్శకత్వంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. కమెడియన్ సునీల్ హీరో ఉదయ్ కిరణ్ ల ది సూపర్ హిట్ కాంబో. చిత్రం, నువ్వునేను,మనసంతా నువ్వే ఇలా ఎన్నో చిత్రాల్లో సునీల్ ఉదయ్ కిరణ్ తో కలిసి నటించారు. ప్రేక్షకులని మెప్పించారు . ప్రేక్షకులని నవ్వించడమే కాదు మనసంతా నువ్వే సినిమాలో ఇద్దరి నటనతో ఏడిపించారు కూడా.

Video Advertisement

అప్పటి జ్ణాపకాలను తలుచుకుని సునీల్ చెప్పిన ఆసక్తికరమైన విషయం ఏంటంటే .. నువ్వునేను సినిమాలో ఉదయ్ కిరణ్ అథ్లెట్ కదా .  చదువులో సున్నా మార్కులు , స్పోర్ట్స్లో మాత్రం ఫ్రైజులన్ని ఉదయ్ వే . ఆ సీన్స్ ఇప్పటికి చాలా ఫన్నీగా ఉంటాయి , మనల్ని నవ్విస్తాయి . నిజానికి సినిమా షూటింగ్ సంధర్బంలో తేజా ఎంత ఫర్ఫెక్ట్ గా ఉంటారో మనకు తెలిసిందే . సీన్ ఫర్ఫెక్ట్ గా రాకపోతే నటీనటులని కొడతారని కూడా టాక్. ఇప్పడు విషయం అది కాదు.నువ్వు నేను సినిమా ఓపెనింగ్ షాట్లో ఒక రన్నింగ్ రేసు సీనుంటుంది. ఆ సీన్లో రన్నింగ్ చేయడం కోసం అందరూ స్టేట్ రన్నర్స్ నే తీసుకున్నారంట తేజ . పోలీస్ అకాడమీలో ట్రెయినింగ్ పొందుతూ , అక్కడ రన్నింగ్లో ఫస్ట్ ,సెకండ్ వచ్చిన వాళ్లంట . వాళ్లతో షాట్  ఉదయ్ రన్ చేయాలి . వాళ్లందరిని కూడా బీట్ చేసి ఉదయ్ ఫస్టొచ్చారట . అసలెలా? అంత ఫాస్ట్ గా ఎలా పరిగెత్తావ్ అని సునీల్ , ఉదయ్ ని అడిగితే “నేను చిన్నప్పటి నుండి సిటీ బస్సుల వెనక పరిగెత్తేవాన్ని అన్నారట” నిజంగా హౌ ఫన్నీ కదా .

అంతే కాదు ఉదయ్ నేచర్ కూడా అంతే ఫన్నీగా ఉండేదట . ఫన్నీగా మాట్లాడడం అందరితో కలిసి పోవడం ఆ విషయాల్నింటిని సునీల్ ఇటీవల ఒక టీవి ప్రోగ్రాం లో గుర్తుచేసుకున్నారు. ఎక్కడ ఉన్నాడో కానీ బంగారం అంటూ సునీల్ ఉదయ్ ని తలుచుకుని సునీల్  బాధ పడుతుంటే మనకి కన్నీళ్లు ఆగవు .

watch video:

image source: 1 , 2, 3

 


End of Article

You may also like