16 ఏళ్ల వయసునప్పుడు అతను కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి…రష్మీ కామెంట్స్..!

16 ఏళ్ల వయసునప్పుడు అతను కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి…రష్మీ కామెంట్స్..!

by Anudeep

Ads

“మీటూ ఉద్యమం” ఆ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సినిమా ఇండస్ట్రీలో ఎందరో నటీమనులు తాము ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న చేదుఘటనలు బయటికి చెప్పుకున్నారు. మన తెలుగు ఇండస్ట్రీలోనైతే కాస్టింగ్ కౌచ్ పై పెద్ద దుమారమే రేగింది.  అయితే ఈ మధ్యకాలంలో ఈ వార్తలు తగ్గినప్పటికి అడపాదడపా హీరోయిన్లు కాస్టింగ్ కౌచ్ పై స్పందిస్తున్నారు. తాజాగా రశ్మి దేశాయ్ , తనను ఒక వ్యక్తి అత్యాచారం చేయబోయాడని కామెంట్ చేయడంతో మళ్లీ ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. సినీ ఇండస్ట్రీకి న వచ్చే ప్రతీ అమ్మాయి లైంగిక వేధింపులు ఎదుర్కోవాల్సిందే , నేను కూడా ఎదుర్కొన్నాను అంటూ సంచలనం సృష్టించింది నటి, హిందీ బిగ్‌బాస్-13 మాజీ కంటెస్టెంట్ రష్మీ దేశాయ్. పెద్ద నిర్మాత సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పి ఓ వ్యక్తి తనను అత్యాచారం చేయాలని ప్రయత్నించాడంటూ చెప్పుకొచ్చింది. బుల్లితెరపై ప్రసారమయ్యే పలు టీవీ కార్యక్రమాలు , సీరియల్స్ ద్వారా అందరికి సుపరిచితమైన నటి రష్మీ దేశాయ్. సల్మాన్ హోస్ట్ చేసే బిగ్ బాస్ 13 లో థర్డ్ రన్నరప్ కూడా. ఆ తర్వాత వెండితెరపై కూడా కనిపించింది.  ఇటీవల ఒక  ఇంగ్లీష్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్ అంశంపై స్పందించింది.పదమూడేళ్ల  క్రిందట తాను కెరీర్ ప్రారంభించానని, అప్పుడే టీనేజ్ లోకి అడుగుపెట్టానని, నటనపై ఇంట్రస్ట్ తో ఇటువైపొచ్చనని చెప్పింది. అయితే ఆ సమయంలో ఆఫర్స్ ఇప్పిస్తాను అనే వంకతో సూరజ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఇండస్ట్రీలో ఎవరూ పరిచయం లేకపోయేసరికి సూరజ్ నిజంగానే అవకాశాలు ఇప్పిస్తాడని నమ్మాను . కానీ తర్వాత సినిమాల్లో ఆఫర్స్ రావాలంటే లైంగికంగా లొంగాల్సిందే అని చెప్పేవాడని, అలా చాలా సార్లు తనను లొంగగదీసుకునే ప్రయత్నం చేశాడని ఆమె చెప్పుకొచ్చింది.పెద్ద నిర్మాత యశ్ రాజ్‌తో కలిసి పనిచేసే అవకాశం ఇప్పిస్తానని తన నెంబర్ తీసుకున్న సూరజ్. ఓసారి ఫోన్ చేసి ఆడిషన్‌కి రమ్మన్నాడు, తీరా అక్కడికి వెళ్ళాక చూస్తే ఆ రూమ్‌లో అతనొక్కడే ఉండడంతో డౌటొచ్చింది . దాంతో వెళ్లిపోతానని చెప్తే కూల్ డ్రింక్ తాగడానికి ఇచ్చి, అది తాగాల్సిందిగా బలవంతం చేశాడు. కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపాడని, దాన్ని తాగించి అత్యాచారం చేయాలనే ప్రయత్నం చేశాడని రశ్మి తెలిపింది.

Video Advertisement

అక్కడినుండి ఎలాగోలా తప్పించుకుని బయటపడి, ఆ తర్వాత అమ్మతో జరిగినదంతా చెప్పాను . దీంతో అమ్మ సూరజ్ ని పిలిపించి  ఇంకోసారి నా బిడ్డ జోలికి వస్తే చంపేస్తాను అని  వార్నింగ్ ఇచ్చిందని, ఈ పని నేనే చేసి ఉండాల్సిందని అనిపిస్తుంటుంది అంటూ చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ రన్నరప్ గా నిలిచిన రశ్మి చేసిన కామెంట్స్ తో మళ్లీ కాస్టింగ్ కౌచ్ వ్యవహారం వైరలవుతోంది.

image source:1 , 2 ,3,4


End of Article

You may also like