ఈ 9 తెలుగు సినిమా విలన్స్ భార్యలు ఎవరో తెలుసా?

ఈ 9 తెలుగు సినిమా విలన్స్ భార్యలు ఎవరో తెలుసా?

by Anudeep

Ads

రాజనాల మొదలుకొని కైకాల సత్యనారాయణ , కోటా శ్రీనివాసరావు , నర్రా వెంకటేశ్వర్రావు , రామిరెడ్డి, సత్య, అమ్రిష్ పూరి ఇలా చెప్పుకుంటూ పోతే మన విలన్ల లిస్టు పెద్దదే. సినిమాల్లో విలన్లుగా వీళ్లని చూడగానే దడపుట్టేది . ఒక సినిమా సూపర్ హిట్ అవ్వడంలో హీరో పాత్ర ఎంతుంటుందో,హీరోకి ధీటుగా ఉండే విలన్ పాత్ర కూడా అంతే ఉంటుంది.

Video Advertisement

ఇప్పటి చిత్రాల్లో విలన్ అనగానే గుర్తొచ్చే మొదటి పేరు ప్రకాశ్ రాజ్ . తండ్రిగా ప్రేమని ప్రదర్శిస్తూనే ఒకే సమయంలో విలన్ గా కూడా విలక్షణంగా నటించగల నటుడు ప్రకాశ్ రాజ్ .ప్రభాకర్,అజయ్, ముకేశ్ రుషి, షియాజి షిండే, పరేష్ రావెల్,అశుతోష్ రానా, రోబో చిత్ర విలన్ డాని, మురళి శర్మ వీళ్లందరిది విలనిజంలో విభిన్న పంథా .

నిజానికి మన మనసుల్లో వాళ్లపట్ల ఒక ముద్ర ఉంటుంది. కానీ ఒకప్పుడంటే తారల గురించిన విషయాలు బయటికి వచ్చేవి కావు, కాని ఇఫ్పుడు సోషల్ మీడియా పుణ్యమాని  నటులకి సంబంధించిన విషయాలు ఈజిగా తెలిసిపోతున్నాయి.

సినిమాల్లో విలన్ క్యారెక్టర్స్ చేసేవాళ్లంతా బయట జీవితంలో రియల్ హీరోలు అనిపించుకుంటున్న ఘటనలు ఇటీవల చాలా జరిగాయి .ఉదాహరణకి ప్రకాశ్ రాజ్, సియాజిషిండే , సోనూసూద్ , మరియు రేసు గుర్రం విలన్ రవి కిషన్ వీళ్లంతా బయట సొసైటీలో మంచి పనులు చేస్తూ , సామాజికంగా తమ గొంతు వినిపిస్తూ రియల్ హీరోలు అనిపించుకుంటున్నారు.

సినిమాల్లో విలనిజాన్ని పండించిన మన విలన్ల భార్యలు ఎలా ఉంటారు? వాళ్ల కుటుంబ సభ్యులెలా ఉంటారు లాంటి డౌట్లు కూడా మనకి అప్పుడప్పుడు వస్తుంటాయి. నిజానికి మన విలన్ల భార్యలందరూ అందగత్తెలే , వాళ్లల్లో కొందరు మనకి తెలిసిన నటీమనులు కూడా, ఉదాహరణకి మురళీ శర్మ భార్య అశ్విని బద్రినాథ్ మూవిలో విలన్ రోల్ చేసింది.

అశుతోశ్ రానా భార్య రేణుక సుహాని ఒకప్పటి బుల్లితెర హోస్ట్ , నటి. సల్మాన్ మాదురి జంటగా వచ్చిన హమ్ ఆప్ కే హై కౌన్ సినిమాలో రేణుక పాత్ర గుర్తుండిపోతుంది. ప్రకాశ్ రాజ్ భార్య రీనా రాయ్ క్యాస్టుమ్ డిజైనర్ . ప్రకాశ్ రాజ్ మొదటి భార్య, డిస్కోశాంతి అక్కా చెల్లెల్లు , అంటే శ్రీహరి, ప్రకాశ్ రాజ్ తోడళ్లుల్లు ఒకప్పుడు.

దివంగత నటుడు రఘువరన్ , నటి రోహిణి భార్యభర్తలు .. రోహిణి బాలనటిగా సినిమారంగ ప్రవేశం చేసింది, బుల్లితెర నటుడు బాలాజి ,రోహిణి ఇద్దరు అక్కాతమ్ముళ్లు. ప్రేమవివాహం చేసుకున్న రోహిణి,రఘువరన్  కొంతకాలం కాపురం తర్వాత  విడాకులు తీసుకున్నారు . సినిమాలకు దూరమైన రోహిణి, తల్లి పాత్రల్లో మళ్లీ అలరిస్తున్నారు.

వదల బొమ్మాలి నిన్నొదలా అనే డైలాగ్ తో ప్రేక్షకులని భయపెట్టిన పశుపతి అలియాస్ సోనూసూద్ భార్య సోనాలిసూద్ యాక్టర్, మోడల్ మరియు ప్రొడ్యుసర్.


End of Article

You may also like