Ads
అభిజ్ణ ఆనంద్ ,కరోనా గురించి ఏడాది క్రితమే చెప్పాడు అంటూ సోషల్ మీడియాలో వైరలైన ఒక వీడియోతో అందరికి సుపరిచితమే. అంతేకాదు కరోనా మే 29తో పూర్తిగా అంతరించి పోతుందని కూడా చెప్పాడని చాలా వార్తలొచ్చాయి. ఎన్నో భయాల మధ్య బతుకుతున్న వారికి అభిజ్ణ మాటలు సంతోషాన్ని,ధైర్యాన్నిచ్చాయి. కాని నేను అలా చెప్పలేదని, నా మాటల్ని వక్రీకరించారని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలని ఖండించాడు.ఇంతకీ తనేం చెప్పాడో మళ్లొకసారి వివరిస్తూ ఆ వీడియోని పోస్టు చేశాడు.
Video Advertisement
మేధావి, ఏకసంతాగ్రహి అనే పదాలు వినే ఉంటారు కదా అభిజ్ణా ఆనంద్ కి అచ్చంగా సూటయ్యే పదాలు. వయసు పద్నాలుగేళ్లు, ఊరు మైసూర్ . వాస్తవానికి ఆ వయసుకి ఇలాంటి విషయాలు ఏం తెలుస్తాయి అనుకోకండి. ముందే చెప్పాంకదా బాలమేధావి అని. ఇప్పటికే వేదాలు చదివేసాడు . బహుభాషా ప్రావిజ్ణుడు , గ్రహ స్థితులని బట్టి భవిష్యత్లో జరగబోయే విషయాలను ముందే చెప్పేస్తుంటాడు. చాలామంది అదెలా సాధ్యం అని కొట్టిపారేస్తుంటారు.మన దగ్గర జోతిష్యం అనేది ఒకటుంది, దాన్ని నమ్మేవాళ్లు చాలామందే ఉన్నారు. జోతిష్యం చెప్పేది గ్రహస్థితులని బట్టే కదా. మనోడు చెప్పింది కూడా ఆ లెక్కప్రకారమే.
మే 29న కరోనా అంతమవుతుందని నేను చెప్పినట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదు. ఇంతకీ నేను చెప్పిందేంటంటే మే 29తర్వాత కరోనా తగ్గుముఖం పడుతుంది . కాని అప్పుడు కూడా ఒకట్రెండు రోజులు మాత్రమే ఆ పరిస్థితి ఉంటుంది. మళ్లీ పరిస్థితి యధాస్థితికి వస్తుంది. కరోనా విజృంబించి ఆ ఎఫెక్ట్ అనేది జూన్ వరకు కొనసాగుతుంది. మే29 నుండి జూన్ చివరి వారం వరకు పరిస్థితి మెల్లిమెల్లిగా అదుపులోకి వస్తుంది. అది చాలా ముఖ్యమైన కాలం. జూలై మొదటి వారానికి కొంచెం మనం ఈ కరోనా నుండి బయటపడి ఊపిరి పీల్చుకోవచ్చు అని చెప్పుకొచ్చాడు.
అంతేకాదు కరోనా ఎఫెక్ట్ మన ఎకానమిపై ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చెప్పాడు. ఎకానమి పరిస్థితి ఇప్పట్లో కుదురుకోకపోవచ్చని అభిజ్ణ మాటల్లో స్పష్టం అవుతుంది. ఇప్పుడు నెలకొన్న పరిస్థితులు ఆరోగ్య పరిస్థితులు, ఆర్దిక పరిస్తితులు పూర్తిగా కుదుటపడడానికి జూలై తర్వాత ఆర్నెళ్లు పడుతుందని చెప్పాడు . అంటే దాదాపు డిసెంబర్ వరకు ఇదే పరిస్థితి ఉంటుందనే విషయాన్ని అభిజ్ణ తన తాజా వీడియోలో చెప్పాడు.
watch video:
End of Article