Ads
పవన్ కళ్యాణ్ ని పవర్ స్టార్ గా మార్చిన “బద్రి” సినిమా వచ్చి ఇరవై ఏండ్లవుతోంది. ఇరవైఏండ్లైనా ఆ సినిమాకి అందులో పవన్ యాక్షన్ కి క్రేజ్ తగ్గలేదు. ఈ చిత్రంతోనే పూరీ దర్శకుడిగా పరిచయం అయ్యారు. రేణు దేశాయ్ హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అప్పటి ఆ చిత్ర విశేషాలను ప్రస్తావిస్తూ ఇన్స్టాలో పోస్టు చేసిన రేణు దేశాయ్ కి చేదు అనుభవం ఎదురైంది . అయినా వెనక్కి తగ్గకుండా నెగటివ్ కామెంట్ పెట్టిన నెటిజన్ కి గట్టి కౌంటర్ ఇచ్చారు రేణు దేశాయ్.
Video Advertisement
బద్రి చిత్రంలో షూటింగ్ లోనే రేణు పవన్ ల మధ్య పరిచయం , ప్రేమ, సహజీవనం ..అప్పటి జ్ణాపకాలను తలచుకొంటూ కొన్నేండ్ల సహజీవనం తర్వాత పెళ్లి ,విడాకులు ఇవన్ని తెలిసిన విషయాలే. విడాకుల తర్వాత పవన్ మరో పెళ్లి చేసుకున్నారు. రేణు కూడా మరో పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు. బద్రి సినిమాలో బంగాళకాతంలో నీరంటే నువ్వేలే షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లారు. ఆ పాట షూటింగ్ సమయంలో తను పడిన ఇబ్బందిని ప్రస్తావిస్తూ , పవన్ తో ఉన్న ఫోటోను శేర్ చేసారు రేణు.
రేణు పోస్టుపై ఒక నెటిజన్ “ ఈ రేణు దేశయ్ ఏంటో మళ్లీ కెళుకుతుంది. అవసరమా ఇప్పుడు…. ఆ మధ్య చాలా Oa(ఒవర్ యాక్షన్) చేసింది. మళ్లీ ఈ పోస్టు ఎందుకో? ఎంగేజ్ మెంట్ అయ్యింది కదా ఆ విషయం ఏమైందో మరి ? నో న్యూస్ ’ అంటూ పోస్టు పెట్టాడు. ఈ పోస్టు రేణుదేశాయ్ దృష్టికి రావడంతో , చూసి చూడనట్టు వదిలేయకుండా రేణు ఆ పోసట్ స్కీన్ షాటో మరో పోస్టు పెట్టింది.
“నాకు ఇప్పుడే ఈ స్క్రీన్ షాట్ వచ్చింది నా మెసేజ్ లో, అవసరమా ఆ? అవును అవసరమే. బద్రి సినిమాకు 20 ఏళ్లు. మీ ఇన్ఫరమేషన్ కోసమే. చాలామంది మరిచిపోతారు. ఇది నా మొదటి సినిమా.సో ఈ మూవీ నా కోసం చాలా చాలా స్పెషల్ ఉంటుంది. ఇంత ద్వేషం ఎందుకు అన్నా? మనం ఆల్రెడీ వరల్డ్ క్రైసిస్ లో ఉన్నాం ఈ వైరస్ వల్ల. కొంచెం మంచి ఆలోచనలు పెట్టుకోండి అందరి కోసం. ఇంత కోపం మీ ఆరోగ్యం కోసం మంచిది కాదు’ అంటూ రేణు రిప్లై ఇచ్చింది. ఎందుకు ఈ నెగటివ్ కామెంట్స్ పట్టించుకోవడం అని మరో నెటిజన్ చేసిన కామెంట్ కి, నా పోస్టులు నన్ను పెట్టుకోనివ్వండి అంటూ సమాధానం ఇచ్చింది.
పవన్ , రేణు విడిపోయినప్పటికి , ఇద్దరూ ఒకరినొకరు పట్టించుకోనప్పటికి పవన్ ఫ్యాన్స్ మాత్రం రేణుని పదేపదే టార్గెట్ చేస్తూనే ఉన్నారు. తన నిశ్చితార్దం అప్పుడు, తను హైదరాబాద్లో ఒక ఇంటిని కొనుక్కున్నప్పుడు ఇలా ఏ అవకాశం దొరికిని వదలకుండా రేణుని ఇబ్బంది పెడుతున్నరు. అయినప్పటికి రేణు తన సహనం కోల్పోకుండా వారికి గట్టిగా కౌంటర్ సమాధానాలు ఇస్తూనే ఉంది..
Naaku ippude ee screen shot vacchindi naa msgs lo.
Avasaram aa? Avvunu, avasaram! It’s #20yearsofbadri mee information kosam. Chala mandi marchipotaaru ee naa modati cinema so ee movie naa kosam chala chala special untundi.
Entha dvesham enduku anna? Manan already oka world crisis lo unnamu ee virus valle. Kunchum manchi alochanalo petkondi andari kosam. Entha kopam mee aarogyam kosam manchi ledhu
#liveandletlive
End of Article