Ads
కిమ్ కి ఏమైంది..మొన్నటి వరకు బాగానే ఉన్నాడు కదా..కరోనా వచ్చిందో లేదో తెలియకముందే దగ్గినా తుమ్మినా ,ఎక్కడివాళ్లనక్కడ చంపేస్తూ లెక్కసెటిల్ చేస్తూ..(అదెంత వరకు నిజమో తెలీదు)..మన దగ్గర నాయకులు కూడా ఇలాగే ఉండాలి, అప్పుడే ప్రజలు వింటారని అందరి చేత భేష్ అనిపించుకుంటూ, ఎన్నో ట్రోల్స్ లో నానుతూ..మరి హఠాత్తుగా ఈ వార్తలేంటి? కిమ్ కి ఏమైంది? ఒకవేళ కిమ్ పోతే తన తర్వాత స్థానం ఎవరిది??
Video Advertisement
ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జాంగ్ ఉన్ గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురయ్యారిన, ఆయనకు బ్రెయిన్ డెడ్ అయ్యిందని రకరకాల వార్తలు వస్తున్నాయి. ధూమపానం, అధిక బరువు వలన సమస్యలు ఎదుర్కొంటున్నారని కొందరు వ్యాఖ్యానించారు. అసలు ఈ వార్తలెలా వచ్చాయంటే.. ఇటీవల ఏప్రిల్ 15న కిమ్ తాత, ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ ఇల్ సంగ్ జయంతి వేడుకలు జరిగాయి.దేశంలా ఏటా జరిగే అతిపెద్ద వేడుకల్లో ఈ కార్యక్రమం కూడా ఒకటి. దీనికి కిమ్ జాంగ్ హాజరు కాలేదు.ఇదివరకు ఎప్పుడూ ఆయన కిమ్ ఇల్ సంగ్ జయంతికి హాజరు కాకుండా లేరు.దీంతో ఆయన ఈసారి వేడుకలకు రాకపోవడంపై అనేక వదంతులు పుట్టాయి.
గత వారం ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు నిర్వహించింది. అప్పుడు కిమ్ ఎక్కడున్నారనేది ఎవరికి తెలీదు. చివరిగా ఏప్రిల్ 12న ఒక కార్యక్రమంలో పాల్గొన్నట్టు మాత్రమే ఆ దేశ మీడియాలో వార్తలొచ్చాయి. తర్వాత ఎలాంటి కార్యక్రమాల్లోనూ కిమ్ కనపడలేదు. ఇప్పుడు ఇలాంటి వార్తలొస్తున్నప్పటికి కిమ్ బయటకి రాకపోవడంతో ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నట్టుంది. ఒక వేళ కిమ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడం నిజమైతే, పుటుక్కున ఏమైనా జరిగి పోయాడనుకో అప్పుడు ఆ దేశ బాధ్యతలు తీసుకునేది ఎవరు? కిమ్ తర్వాత స్థానం ఎవరిది అంటే అతడి చిన్నచెల్లెలు కిమ్ యో జాంగ్.
అదేంటి దేశాన్ని గడగడలాడించిన కిమ్ స్థానంలోకి అతడి చెల్లెలా అని తక్కువ అంచనా వేయకండి..ఈమె అన్నకంటే నాలుగాకులు ఎక్కువే చదివింది.కిమ్ కంటే నాలుగేళ్లు చిన్న అయిన 31ఏళ్ల కిమ్ యో జాంగ్ అన్నకంటే కఠినాత్మురాలు . కిమ్ కి అత్యంత సన్నిహితురాలు, తనని ఎప్పుడు కలవాలనుకుంటే అప్పుడు కలవగలిగే ఏకైక్ వ్యక్తి కిమ్ యో జాంగ్ . ఇప్పటికే కిమ్ ఈమెకి అన్ని రకాలుగా ఎంకరేజ్ చేస్తూ అన్ని విషయాల పట్ల అవగాహన కలిగేలా చేశాడు.ఇతర దేశాలతో సంబంధాలు, మిలటరి వ్యవహారాలు అన్నతో సమానంగా చూస్తుంది కిమ్ యో జంగ్.
స్విట్జర్లాండ్లో పేరు మార్చుకుని చదువుకుంది. కిమ్ వార్తల్లోకి రావడం ఇది మొదటిసారి కాదు . 2012 నుండి తను వార్తల్లో వ్యక్తి గా ఉంది. అప్పుడు కూడా కిమ్ ఆరోగ్యం విషమించిదని వార్తలు రావడంతో తన తర్వాత స్థానం ఎవరు అనేదానిపై ఎక్కువగా వినపడిన పేరు కిమ్ యో జంగ్ దే. అప్పటి నుండి కూడా తను అన్నతో పాటుగా పరిపాలన వ్యవహారాలు చూస్కుంటూ అన్నకు తోడుగా ఉంది. కిమ్ గురించిన వార్తలు ట్రంప్ నోట , మీడియా నోట తప్ప ఆ దేశ మీడియాలో కాని, అధికారికంగా కాని ఎక్కడా వెళ్లడి కాలేదు..కాబట్టి ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు..
End of Article