ఓ మహిళ ఆడిన అష్టాచెమ్మా ద్వారా 31 మందికి కరోనా…ఆ వార్తపై ట్రెండ్ అవుతున్న ట్రోల్ల్స్ ఇవే.!

ఓ మహిళ ఆడిన అష్టాచెమ్మా ద్వారా 31 మందికి కరోనా…ఆ వార్తపై ట్రెండ్ అవుతున్న ట్రోల్ల్స్ ఇవే.!

by Anudeep

Ads

అప్పట్లో వచ్చిన “మనీ” సినిమాలో బ్రహ్మీ “ ఖాన్ దాదాతో గేమ్స్ వద్దు శాల్తీలు లేచిపోతాయి” అని అంటాడు. సేమ్ అదే స్టైల్లో ఇప్పుడు సూర్యాపేట అమ్మమ్మ “కరోనాతో అష్టాచెమ్మ వద్దు ఖర్సైపోతారని” అనడమే కాదు ఆచరణలో చూపించింది కూడా.. ఆమె ఆడిన అష్టాచెమ్మా దెబ్బకి కరోనా జాబితాలో సూర్యాపేట ఏకంగా రెండో ప్లేస్ కి చేరుకుంది. జిల్లాల లెక్కన చూస్తే సూర్యపేటనే ఫస్ట్ ప్లేస్..

Video Advertisement

కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్టు సూర్యాపేటలో కరోనా విరుచుకుపడడానికి అనేక అంశాలు కారణమైనా కూడా ఈ అష్టాచెమ్మా వ్యవహారం మాత్రం బాగా వైరలైంది. కరోనా లాక్ డౌన్ తో ఎటూ టైం పాస్ కాక అందరూ అష్టా చెమ్మా, వైకుంఠపాళిలు అంటూ ఇండోర్ గేమ్స్ మొదలెడితే.. కరోనా కూడా చాపకింద నీరులా తన గేమ్ తాను ఆడి చివరికి విన్నర్ గా నిలిచింది.

ఒకరు ఇద్దరికి కాదు ఏకంగా 31 మందికి కరోనా ఎఫెక్ట్ కావడంతో సూర్యపేటలో కలకలం రేగింది. సోషల్ డిస్టెన్సింగ్ పాటించకుండా ఇష్టమొచ్చినట్టుగా ఉండి మాకేం కాదులే అని ధీమాతో అంతమందికి కరోనా సోకేసరికి.. వెంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు.. ఈ దెబ్బకి ఎస్పీ , డిఎస్పిలను బదిలి చేసింది ప్రభుత్వం.కరోనా సోకడానికి కారణం అష్టాచెమ్మా ఆడడమే అని సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుండి ఇళ్లల్లో ఖాళీగా కూర్చోలేక చాలామంది ఆ కాలం ఆటలన్నింటిని మళ్లీ తెరమీదకి తెచ్చారు . ప్లేయింగ్ అష్టాచెమ్మా, వైకుంఠపాళి అంటూ స్టాటస్లు కూడా పెడుతూ సంబరపడ్డారు. కానీ ఈ ఒక్క న్యూస్ తో ఇంట్లో కూర్చుని ప్రశాంతంగా ఇండోర్ గేమ్స్ ఆడుకున్నా సుఖం లేదని టెన్షన్ పడుతున్నారు.

నిజానికి ఇది కేవలం టివి9లో మాత్రమే వచ్చిన వార్త, ఇందులో నిజనిజాలెంత అనేది తేలాల్సి ఉంది.  సర్లెండి కొద్ది సేపు ఆ టెన్షన్ పక్కకు పెట్టి, అష్టాచెమ్మ ఆడడం ద్వారా 31మందికి కరోనా సోకింది అనే దానిపై సోషల్ మీడియాలో వచ్చిన రకరకాల ట్రోల్స్ చూసి కడుపుబ్బా నవ్వుకోండి.


End of Article

You may also like