లాక్ డౌన్ వేళ పోలీసుల బ్రిలియంట్ ఐడియా వైరల్ వీడియో వెనకున్న కథ!

లాక్ డౌన్ వేళ పోలీసుల బ్రిలియంట్ ఐడియా వైరల్ వీడియో వెనకున్న కథ!

by Anudeep

Ads

విషాదంలో నుండి వినోదం పుడుతుంది అంటే ఇదేనేమో.. లాక్ డౌన్ పాటించండి, ఇళ్లల్లోనుండి బయటకు రాకండి బాబూ అంటూ  చేతులెత్తి మొక్కారు, లాఠీ పట్టి కొట్టారు అయినా కూడా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అలాంటి వారికి చెప్పి చెప్పి విసిగిపోయిన పోలీసులు కొత్త పద్దతి కనిపెట్టారు.. తమిళనాడు పోలీసులు కనిపెట్టిన ఈ కొత్త పద్దతి సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది..

Video Advertisement

ఒకవైపు రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి..మరోవైపు ప్రజల నిర్లక్ష్య ధోరణి.. ప్రాణాల అంటే తీపి లేక కాదు, ఆ మాకేం కాదులే అనే ధీమాతో ఎంత చెప్పినా వినకుండా రోడ్లెక్కుతున్నారు. కొన్ని చోట్ల పోలీసులు వాతలు తేలెట్టు కొట్టారు అప్పుడు కూడా పోలీసులను తప్పు పట్టి వాళ్ల ఉద్యోగాలనుండి సస్పెండ్ అయ్యేలా చేసాం కాని , వారి మాట వినలేదు..ఇలా కాదని చేతులెత్తి మొక్కుతూ కాళ్ల మీద పడ్డారు అయినా కూడా పరిస్థితి మారలేదు.

 

ఇలా కాదు అని రోడ్ల మీదకి వచ్చిన వారిని తీస్కెళ్లి కరోనా పేషెంట్ ఉన్న అంబులెన్స్ లో పడేశారు.. అప్పుడు చూడాలి వాళ్ల కళ్లల్లో భయం..అరుపులు, ఏడుపులు , పెడబొబ్బలు..సార్ ప్లీజ్ సార్, దండం పెడతాం సర్ అంటూ, కిటికిలోనుండి బయటకి దూకేయడానికి ప్రయత్నిస్తూ.. మళ్లీ జన్మలో ఇంటి గడప తొక్కాలంటే భయపడేట్టు చేశారు తమిళనాడు పోలీసులు. నిజానికి ఈ మూడు నిమిషాల వీడియో చూస్తున్నంత సేపు నవ్వుతో పాటు, ఒక రకమన భయం కూడా కలుగుతోంది.

కరోనా వైరస్ అంటే భయం లేకుండా ప్రవర్తిస్తున్నారిని, వారికి ఒక రకమైన భయం కల్పించడానికి, లాక్ డౌన్ పాటించకపోతే ఎలాంటి శిక్ష ఉంటుందో అని చెప్పడానికి అవేర్నెస్ కోసం తమిళనాడు పోలీసులు క్రియేట్ చేసిన వీడియో ఇది. సోషల్ మీడియాలో తెగ వైరలువుతోన్న ఈ వీడియో చూసి తిక్క కుదిరింది, ఇలాంటి పనిష్మెంట్ ఇస్తే తప్ప వీళ్లు బాగుపడరు అనే కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

watch video:


End of Article

You may also like